చంద్రబాబు గవర్నర్ తో మాట్లాడిన తీరు చూస్తే మంచి నటుడు అనిపించుకున్నాడని.. నంది, ఆస్కార్ అవార్డ్ స్థాయి నటన కనబర్చాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేశా చేశారు.
విజయవాడ: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి అధికార వైసిపిలోకి భారీ వలసలు కొనసాగుతున్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నుండి ఇంకా పదిమంది ఎమ్మెల్యేలు వైసిపిలోకి వచ్చినా ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపి రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నారు.
చంద్రబాబు గవర్నర్ తో మాట్లాడిన తీరు చూస్తే మంచి నటుడు అనిపించుకున్నాడని.. నంది, ఆస్కార్ అవార్డ్ స్థాయి నటన కనబర్చాడని ఎద్దేశా చేశారు. ఎన్టీఆర్ సినిమా లో నటుడు అయితే చంద్రబాబు రాజకీయాల్లో నటుడు అని నిరూపించుకున్నాడని సెటైర్లు విసిరారు.
ప్రస్తుతం జరుుగుతన్న స్థానికసంస్థల ఎన్నికల్లో టిడిపికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. అందువల్లే ఏదో ఒకటి చేసి ఎన్నికలను రద్దు చేయాలని టిడిపి చూస్తోందని... అందువల్లే ఆ పార్టీ నాయకులు గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
read more తమ్ముడి రాజీనామాపై కేఈ కృష్ణమూర్తి స్పందన... ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
ఇప్పటికే సీఎం జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం 90 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిందని... వీటిన్నంటిని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు సైతం ఈ పథకాలు ఆకర్షణీయులై వైసిపికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. టిడిపి నుండి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఇప్పటికే బయటకు వచ్చారని... అవి కప్పి పుచ్చుకోవడానికి తమపై నెపం తోస్తున్నారని అన్నారు.
గతంలో రాజ్యసభ ఇస్తాం అని వర్ల రామయ్యను మోసం చేశారని... ఇప్పుడు ఓడిపోయే స్థానానికి ఇచ్చి ఆ ఎస్సి నాయకున్ని బలి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యసభకు చంద్రబాబు తన కొడుకుని ఎందుకు నిలబెట్టలేదని మంత్రి ప్రశ్నించారు.
చంద్రబాబు మీడియాలో కనపడకుండా ఉండలేరని... గతంలో మోడీని దూషించి ఇప్పుడు మళ్ళీ కాళ్ళ బేరానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతు భరోసా, అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటి ఆనేక పథకాలు చంద్రబాబు కు కనపడవన్నారు. వీటిద్వారా లబ్దిపొందిన వారు మాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారన్నారు.
read more టిడిపి వీడనున్నట్లు ప్రచారం... క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు
ఉగాదికి ఇళ్లపట్టలు పంచడం కోసం ఎన్నికల సంఘం అనుమతి కొరామని... ఆన్ గోయింగ్ స్కీం కాబట్టి ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుంది అని భావిస్తున్నామన్నారు. చంద్రబాబు తపన అంత కుమారుడు కోసమేనని... అయితే దారి చూపిన ముందుకు పోలేని పరిస్థితి లోకేష్ ది అని మంత్రి ఎద్దేవా చేశారు.