రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమతడే... ఇకపై మీ ఇష్టం: వైసిపి ఎమ్మెల్యేలకు వర్ల సూచన

By Arun Kumar P  |  First Published Mar 13, 2020, 4:36 PM IST

ముఖ్యమంత్రి జగన్ అంబానీ వద్ద మూటలు అందుకుని దళితులకు అన్యాయం చేస్తూ వ్యాపారవేత్త పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు కేటాయించారని టిడిపి రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య ఆరోపించారు. 


గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ వద్ద డబ్బుల మూటలు తీసుకుని ఆయన సన్నిహితుడు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చాడని టిడిపి రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య ఆరోపించారు. ఈ విషయం అధికార పార్టీలో వున్న ప్రతి ఎమ్మెల్యేకు తెలుసని అన్నారు. కాబట్టి మూటలు అందుకొని సీటు ఇచ్చిన నత్వానికి ఓటు వేస్తారో... దళితుల వాయిస్ వినిపించే తనకు ఓటు వేస్తారో ఆత్మ ప్రబోదం ప్రకారం నిర్ణయించుకోవాలని వైసిపి నాయకులకు రామయ్య సూచించారు. 

గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ వాళ్ళు చంపేసారని జగన్ ఆరోపించారని గుర్తుచేశారు. అప్పుడు ఆయన మాటలు నమ్మి అనేకమంది దళితులు రిలయన్స్ సంస్థలపై దాడులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అదే ముఖేష్ అంబానీ ఇచ్చిన మూటలకు ఆశపడి తమకోసం కేసుల్లో ఇరుక్కున దళితులకు జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. 

Latest Videos

read more  తమ్ముడి రాజీనామాపై కేఈ కృష్ణమూర్తి స్పందన... ఎన్నికల బహిష్కరణ నిర్ణయం

దళిత బిడ్డల ఉసురు తీసి సీఎం నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. ఇలా రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన అంబాని సూచించిన వ్యక్తికి ఓటేస్తారా...? అని వైసిపి ఎమ్మెల్యేలను వర్ల ప్రశ్నించారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఆత్మప్రభోదానుసారమే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని... ఆయనను అభిమానించే వైసిపి ఎమ్మెల్యేలు కూడా తమ అంతరాత్మ సూచించిన వ్యక్తికే ఓటేయాలని అన్నారు.  

తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారమే నామినేషన్ వేసినట్లు తెలిపారు. ''23 మంది ఎమ్మెల్యేలు ఉంటే నామినేషన్ ఎలా వేస్తారు అంటున్న174 మంది ఎమ్మెల్యేలు కి విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దల సభలో దళితుల వాయిస్ వినిపించడం వర్ల రామయ్యకే సాధ్యం కాబట్టి మీరు కూడా నాకే ఓటేస్తే మంచిది. 

అంబేద్కర్ బావజాలం అధికార పార్టీలో ఎక్కడా కనిపించటం లేదు. నాలుగు సీట్లు కూడా దళితులుకానీ వారికి ఇచ్చారు. ఒక సీటు కూడా దళితులకు ఇవ్వాలని అనిపించలేదా'' అని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

read more  టిడిపి వీడనున్నట్లు ప్రచారం... క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు
 
తనను రాజ్యసభ అభ్యర్థగా ప్రకటించిన చంద్రబాబుకి రామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి అదిమూలపు సురేష్ అన్నట్లుగా తాను ఎప్పుడు వలవల ఎడవలేదన్నారు.  జగన్మోహన్ రెడ్డి పక్కన  ఎప్పుడైనా దళిత మంత్రులు కూర్చున్నారా...కానీ తాను ఎప్పుడూ చంద్రబాబు పక్కనే  కూర్చుంటానని అన్నారు. ఇటీవల కోర్టు మొట్టికాయ వేశాక జగన్ ముఖంలో కళ తప్పిందని... ఎన్నికల తర్వాత అది మరింత వాడిపోనుందని వర్ల అన్నారు. 
 

click me!