అమిత్ షాతో చంద్రబాబు ప్రేమాయణం...లవ్ లెటర్లు కూడా: పేర్ని నాని

By Arun Kumar PFirst Published Oct 25, 2019, 8:34 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అమిత్ షాల ప్రెండ్‌షిప్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు విషెస్ చెప్పడాన్ని  ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి: ప్రతీ రోజు అందరికీ సుద్దులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు ఒక్క రోజులో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమేంటని మంత్రి పేర్నినాని  ఆరోపించారు. ఈ విషయంలో తాజాగా కోర్టు కూడా చంద్రబాబును ప్రశ్నించిన విషయాన్ని నాని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఢిల్లీ లో దీక్ష కోసం రైళ్లలో టిడిపి వారిని తరలించడానికి ప్రభుత్వానికి సంబంధించిన కోటి రూపాయలు ఖర్చుచేయడమేంటని అన్నారు. ఇందుకోసం ఏకంగా  రైల్వే శాఖకు డబ్బులు చెల్లిస్తూ జిఓ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో డ్రామాలాడటానికి ఈ మొత్తాన్ని ఉపయోగించినట్లు నాని ఆరోపించారు.

డిల్లీలోనే కాదు జిల్లాల్లో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు దీక్షలు చేశారన్నారు. అప్పట్లో సొమ్ము రాష్ట్ర ప్రజలయిదే సోకులు మాత్రం తెలుగు దేశం పార్టీవని ఎద్దేవా చేశారు. ప్రజా ధనంతో ఏ ప్రభుత్వమైనా దీక్షలు చేస్తుందా?  అన్నీ దొంగ దీక్షలేనని మంత్రి విమర్శించారు.

read more బాబుతో లాలూచీ-జగన్ తో పేచీ, ఇదేనా నీ పవనిజం: మంత్రి నాని ఫైర్

చంద్రబాబు అధికారంకోసం ముందు మూడేళ్లు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని... ఆ తర్వాత తిట్టిపోశారన్నారు.. ఇప్పుడు మళ్లీ మోడీతో తెగతెంపులు చేసుకోవడం తప్పంటు చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ  చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేశ్ లవ్ లెటర్లు పంపుతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు అమరావతి ని బంగారు బాతు అన్నారని... కానీ ఇక్కడి సౌకర్యాలపై స్వయంగా కోర్టే ప్రశ్నిస్తుంటే ఆయనేం సమాధానం చెప్పడంలేదన్నారు.

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి లక్ష కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. రాజధానిలో భూములు, స్కాములు చేశారని...రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుని కావాల్సిన వారికి ఇచ్చుకున్నారంటూ చంద్రబాబుపై నాని ద్వజమెత్తారు. 

read more ''కేటీఆర్ సార్...చదువుకోవాలంటే ఈ సాహసం చేయాల్సిందేనా...''

ఇదేక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. పవనిజం అంటూ పదేపదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ జగన్ ను వ్యతిరేకించడమే పవనిజమా అంటూ నిలదీశారు. చంద్రబాబుతో లాలూచీపడి సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.చంద్రబాబు నాయుడుతో లాలూచీపడి జగన్ పేచీ పెట్టుకోవడమే పవన్ రాజకీయమా అంటూ నిప్పులు చెరిగారు. 

సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పవన్ కళ్యాణ్ పరిశీలించాలని హితవు పలికారు. సీబీఐ కేసులు అనేవి ఆరోపణలు మాత్రమేనని వాటిని బూచిగా చూపించి మాట్లాడటం తగదన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం సైతం జగన్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్నినేని నాని స్పష్టం చేశారు. 

click me!