ఏపికి పొంచివున్న వర్షం ముప్పు... అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అనిల్

By Arun Kumar P  |  First Published Oct 25, 2019, 5:15 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ముప్పు పొంచివున్న కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. 


అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న వరద పరిస్ధితిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తమైంది. ఈ క్రమంలో జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  సహాయక చర్యలపై వారితో చర్చించారు. 

భారీ వర్షాలతో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న వరద పరిస్ధితి గురించి అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో 13 జిల్లాల నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Latest Videos

undefined

read more  ఎస్పీ కార్యాలయంలోనే... ఒకే యువతితో ఇద్దరు పోలీసుల ప్రేమాయణం

 కృష్ణానది వరదతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల మీద వరద ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. 

దిగువ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్‌ చేయాలని అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని జిల్లాల్లోని  సాగునీటి ప్రాజెక్టుల్లో పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అలెర్ట్‌గా ఉండాలన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో ప్రాజెక్టులను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.... ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

read more   ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఏపీకి వర్షం ముప్పు ఇంకా పొంచివున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడినప్పటికి  ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాపై ఇది కేంద్రీకృతమైందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులను హెచ్చరించింది.

click me!