ఎస్పీ కార్యాలయంలోనే... ఒకే యువతితో ఇద్దరు పోలీసుల ప్రేమాయణం

Published : Oct 25, 2019, 04:25 PM ISTUpdated : Oct 25, 2019, 04:37 PM IST
ఎస్పీ కార్యాలయంలోనే... ఒకే యువతితో ఇద్దరు పోలీసుల ప్రేమాయణం

సారాంశం

గుంటూరు జిల్లాలో పోలీస్ విభాగానికే తలవంపులు తీసుకొచ్చే సంఘటన తాజాగా చోటుచేసుకుంది.  జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులవల్లే జిల్లా పోలీస్ విభాగం తలదించుకోవాల్సి వచ్చింది.  

మంగళగిరి: తమ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని కోసం ఇద్దరు పోలీసులు పోటీపడ్డారు. ఆమెను దక్కించుకోడానికి ప్రయత్నించి చివరకు ప్రాణత్యాగానికి సైతం సిద్దమయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో డిపివోలో జూనియర్ అసిస్టెంట్స్ నాగరాజు, రుద్రనాథ్ లకు అక్కడే పనిచేసే కాంట్రాక్ట్  ఉద్యోగిణితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితోనూ ఆమె సన్నిహితంగా వుండటంతో వారు దాన్ని ప్రేమగా భావించినట్లున్నారు. దీంతో ఆమెపై విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నారు. 

read more ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

ఈ క్రమంలోనే యువతి  కోసం వారిద్దరు  కార్యాలయంలోనే  బాహాబాహీకి దిగారు. దీంతో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సహోద్యోగులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే  అప్పటికే అతడు తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాడో వివరిస్తూ ఫేస్ బుక్ లో లైవ్ పెట్టాడు. 

read more వర్షాలతో పంటనష్టం... పొలాల్లోకి వెళ్లి రైతులకు భరోసానిచ్చిన వ్యవసాయమంత్రి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ విషయం రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు దృష్టికి వెళ్లింది. దీంతో సీరియస్ అయిన ఆయన ఈ ముగ్గురు ఉద్యోగులను విధులనుండి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని ఎస్పీ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా