అప్పుడు వరద రాజకీయాలు, ఇప్పుడు హత్యారాజకీయాలా....?: చంద్రబాబుపై మంత్రి మోపిదేవి

By Nagaraju penumala  |  First Published Sep 10, 2019, 2:52 PM IST

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జలకళ ఉట్టిపడుతోందని రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని మోపిదేవి వెంకటరమరణ స్పష్టం చేశారు. జగన్ కు ప్రకృతి కూడా సహకరించడంతో ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 
 


గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. వైయస్ జగన్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ విమర్శించారు. 

సమర్థవంతమైన జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జలకళ ఉట్టిపడుతోందని రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని మోపిదేవి వెంకటరమరణ స్పష్టం చేశారు. జగన్ కు ప్రకృతి కూడా సహకరించడంతో ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఇటీవలే వరద రాజకీయాలకు తెరలేపారని అవి ఫెయిల్ కావడంతో తాజాగా హత్యా రాజకీయాలకు తెరలేపారని స్పష్టం చేశారు.  

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు ఉండేవని తమ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవన్నారు. 

ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులదేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని మంత్రి  మోపిదేవి స్పష్టం చేశారు. 

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చెందిన అక్రమ మైనింగ్‌పై కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. కోడెల కుటుంబం చేసిన వేధింపుల వల్ల బలైన బాధితులు కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తే దానికి తమని నిందించడం కరెక్టా అని ప్రశ్నించారు. అవినీతి లేకుండా సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, కావాలని తమపై నిందలు వేస్తే సహించేది లేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ వార్నింగ్ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

click me!