అందుకే బాబును హౌస్ అరెస్ట్ చేశాం: డీజీపీ గౌతం సవాంగ్

By narsimha lode  |  First Published Sep 11, 2019, 3:34 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హౌస్ అరెస్ట్ పై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. 



అమరావతి: పల్నాడులో ఉద్రిక్తతలను నివారించేందుకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.

బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందున తాము చంద్రబాబునాయుడును అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పల్నాడులో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు

Latest Videos

undefined

. చంద్రబాబునాయుడు పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తే మరింత టెన్షన్ ఏర్పడే అవకాశం ఉందని  భావించి ముందుజాగ్రత్తగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశామన్నారు. బుధవారం నాడు ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోటీగా వైఎస్ఆర్‌సీపీ కూడ ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

పోటా పోటీగా రెండు పార్టీలు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి.దీంతో టీడీపీ నేతలను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబును కూడ ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బయటకు వెళ్లకుండా గేటు బయటే పోలీసులు మోహరించారు. 

సంబంధిత వార్తలు

1989లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు: ఆత్మకూరులో ఆసలేం జరిగింది?

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష

 ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు: హౌస్ అరెస్ట్‌పై బాబు

గుంటూరులో తొలగిన టెన్షన్: స్వగ్రామాలకు వైసీపీ బాధితులు

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

click me!