నీహారిక క్లీవేజ్ షో.. అది ఎక్స్‌పోజింగ్ కాదంటున్న ఫ్యాన్స్!

By AN TeluguFirst Published Sep 19, 2019, 1:12 PM IST
Highlights

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫొటో‌షూట్‌పై సోషల్ మీాడియాలో ఆమె ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కొంత మంది ఈ ఫొటోలను అందాల ఆరబోత, ఎక్స్‌పోజింగ్ అంటూ ఉంటే ఇందులో అవెక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.
 

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువగా ఉంటుంది. మెగాఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నీహారిక నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మొదట్లో మెగాభిమానులు ఆమె ఎంట్రీపై కస్సుబస్సులాడారు. కానీ నాగబాబు వారిని బుజ్జగించి తన కూతురు హాట్ రోల్స్ చేయదని నటనపై ఇష్టంతో ఎంట్రీ ఇస్తోందని క్లారిటీ 
ఇచ్చారు. నీహారిక కూడా వెండితెరపై ఎలాంటి అందాల ఆరబోత చేయకుండా మంచి పాత్రలే చేసింది.

కానీ ఆమెకి నటిగా సరైన గుర్తింపు రావడం లేదు. అందుకే వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. గతంలో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ లో నటించిన నీహారికా ప్రస్తుతం 'మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది. మరోపక్క 'సైరా' సినిమాలో బోయపిల్ల పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో కూడా నీహారిక కనిపించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీహారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మోడర్న్ డ్రెస్ లో నీహారికా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఈ ఫోటోలతో ఆమె  షాక్ ఇచ్చింది. గతంతో పోలిస్తే నీహారిక హాట్ లుక్ కోసం ప్రయత్నిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఆమె అభిమానులు మాత్రం నీహారికకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎక్స్‌పోజింగ్ ఏమీ లేదని, డ్రెస్ డిఫరెంట్‌గా ఉండడంతో అలా అనిపిస్తుందని.. నిహారిక డ్రెస్ లో ఎలాంటి వల్గారిటీ లేదని.. బయట చాలా మంది అమ్మాయిలూ ఇలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నారని.. నీహారిక కూడా ట్రై చేసిందని అంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💚 Thanks for the last minute fix!🤗 @sayali_vidya @twisteddevotion @vicharemeghna

A post shared by Niharika Konidela (@niharikakonidela) on Sep 17, 2019 at 10:12pm PDT

click me!