రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీలో మరో బాలీవుడ్ బ్యూటీ... భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్!

Published : Mar 13, 2024, 10:38 AM IST
రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీలో మరో బాలీవుడ్ బ్యూటీ... భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్!

సారాంశం

రామ్ చరణ్ 16వ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరో బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపిందట.   

హీరో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరాడు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబు సానతో చేయాల్సి ఉంది. రామ్ చరణ్ 16వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. త్వరలోనే ఆర్సీ 16 చిత్రీకరణ మొదలుకానుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతమైన స్క్రిప్ట్ బుచ్చిబాబు సిద్ధం చేశాడట. ఉత్తరాంధ్రలో నడిచే కథ ఇది. ఈ క్రమంలో ఆ ప్రాంత నటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. 

ఇక ఆర్సీ 16లో రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ని  తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానించారు. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం కృతి సనన్ ని అనుకుంటున్నారట. ఆమెను సంప్రదించగా పచ్చజెండా ఊపిందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఆర్సీ 16లో కృతి సనన్ నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తెలుగులో కృతి సనన్ కి ఐరన్ లెగ్ ఇమేజ్ ఉంది. ఆమె డెబ్యూ మూవీ వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్. మూడో చిత్రం ఆదిపురుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఆదిపురుష్ మూవీలో రాఘవుడు ప్రభాస్ కి జంటగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇది డిజాస్టర్ అయ్యింది. మరి అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కృతి సనన్ ని ఎంచుకోవడం సెంటిమెంట్ పరంగా రిస్క్ అని చెప్పాలి. కాగా ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబుకు ఇది రెండో చిత్రం మాత్రమే. మరి సుకుమార్ శిష్యుడు రామ్ చరణ్ వంటి బడా స్టార్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి ... 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?