30 ఏళ్లు దాటాయా..? మహిళలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవి..!

First Published | Jul 31, 2024, 9:52 AM IST

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే... కచ్చితంగా తమ ఆహారంలో కొన్ని ఆహారాలు భాగం చేసుకోవాలి. మరి..  ఎలాంటి ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలో ఓసారి చూద్దాం....

woman eating food

ప్రతి ఇంట్లో మహిళలు.. తమ కుటుంబ సభ్యుల కోసం, పిల్లల కోసం చాలా చేస్తారు. కానీ.. తమ గురించి మాత్రం ఆలోచించుకోరు. తమకు నచ్చిన ఏ ఆహారం చేసుకోరు.. తమకు కావాల్సిన వాటిని మాత్రం విస్మరించేస్తూ ఉంటారు. ముఖ్యంగా పోషకాహారం తినడమే మానేస్తారు. అందుకే 30ఏళ్లు దాటగానే.. మహిళలకు ఆరోగ్య సమస్యలు రావడం మొదలౌతున్నాయి. థైరాయిడ్, పీసీఓడీ, మోకాళ్ల నొప్పులు.. ఇలా ఒకటి కాదు... చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి.. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే... కచ్చితంగా తమ ఆహారంలో కొన్ని ఆహారాలు భాగం చేసుకోవాలి. మరి..  ఎలాంటి ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలో ఓసారి చూద్దాం....


1.ఎండు ద్రాక్ష..

మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే... వారి డైట్ లో ఎండు ద్రాక్షను భాగం చేసుకోవాలి. అది కూడా నార్మల్ గా కాదు. నానపెట్టిన ఎండు ద్రాక్షను కచ్చితంగా తినాలట.  ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.  ఎండుద్రాక్ష తినడం వల్ల.. శరీరంలో రక్త హీనత తగ్గిపోతుంది. శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది.  ముఖ్యంగా ఏవైనా పీరియడ్స్ సంబంధిత సమస్యలు ఉంటే.... వాటిని దూరం చేయడంలో ముందుటాయి. ప్రతిరోజూ రాత్రి పూట 5 ఎండు ద్రాక్షలను నానపెట్టి.. ఉదయాన్నే తింటే సరిపోతుంది.

Latest Videos


2.ఉసిరి..
మహిళల డైట్ లో భాగం చేసుకోవాల్సిన మరో సూపర్ ఫుడ్ ఉసిరి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళలకు చాలా అవసరం. అంతేకాదు... ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన శరీరంలో ఐరన్  శోషణను కూడా పెంచుతుంది. మీరు ఉసిరి పొడి, రసం లేదా జామ్ తినవచ్చు.

Papaya Seeds

3.దానిమ్మ...
వారానికి 1-2 సార్లు మీ ఆహారంలో దానిమ్మపండు ఉండేలా చూసుకోండి. ఇది గుండె, సంతానోత్పత్తి , ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మ రక్తహీనతను దూరం చేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో లైకోపీన్ ఉంటుంది, ఇది అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయి కాలేయానికి కూడా చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.
 

ఇవి మాత్రమే కాదు... మహిళల డైట్ లో... గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు , నువ్వులు కూడా కచ్చితంగా తీసుకోవాలి.  ఈ గింజలు హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడతాయి. అలాగే, ఇవి PMS లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. జుట్టు , ఎముకలకు కూడా ఇవి చాలా మేలు చేస్తాయి.

వాల్నట్స్, బాదం.. 
వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తాయి. నానబెట్టిన వాల్ నట్స్ , బాదం పప్పులను రోజూ ఉదయం తింటే శరీరానికి బలం చేకూరుతుంది. బాదం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతను కూడా నయం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదం ,వాల్‌నట్‌లను తినండి.

click me!