వారానికి ఒకటి ఈ లడ్డూ తింటే... జుట్టు రాలడం ఆగిపోవాల్సిందే..!

First Published | Jul 30, 2024, 3:59 PM IST

వారానికి  కేవలం ఒకే ఒక లడ్డూ తినడం వల్ల.. జుట్టు ఊడటం రాలి.. ఒత్తు పెరుగుతుందంటే మీరు నమ్ముతారా..?

laddu

ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా.. తమ జుట్టు విపరీతంగా రాలుతుందనే ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. జుట్టు రాలడానికి  ఒక్కొక్కరికి కారణం ఉండచ్చు. కానీ... జుట్టు మాత్రం రాలడం మాత్రం కామన్ అయిపోయింది. ఇక.. దానిని తగ్గించుకోవడం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ మంది ఆయిల్, షాంపూలను మార్చేస్తారు. అయితే.. అవన్నీజుట్టుకి పై పై మెరుగులు మాత్రమే అవ్వగలవు. అలా కాకుండా.. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా.. వారానికి  కేవలం ఒకే ఒక లడ్డూ తినడం వల్ల.. జుట్టు ఊడటం రాలి.. ఒత్తు పెరుగుతుందంటే మీరు నమ్ముతారా..?


మీరు చదివింది నిజమే. ఈ లడ్డూ కనుక తింటే.. మీ  జుట్టు రాలడం ఆగిపోయినట్లే. మంచిగా ఒత్తు గా పెరుగుతుంది. మరి, ఆ లడ్డు ఏంటి..? దానిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.... మనకు మార్కెట్లో హలీమ్ గింజలు అని దొరుకుతాయి. చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వాటితో చేసే ఈ లడ్డు మనకు జుట్టును ఊడిపోకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 


లడ్డూ కావాల్సిన పదార్థాలు... 

దేశీ నెయ్యి - 1 టీస్పూన్
తురిమిన కొబ్బరి 2 కప్పులు
బెల్లం 2 స్పూన్
హాలీమ్ గింజలు అర కప్పు

లడ్డూ తయారు చేసే విధానం... 
లడ్డు తయారు చేసే ముందు హలీమ్ గింజలను గంటసేపు నానబెట్టాలి.ఇప్పుడు ఒక పాన్ తీసుకొని గ్యాస్ గెలిగించి.. ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిఅవ్వగానే.. తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి.. ఎర్రగా అయ్యే వరకు వేయించాలి.  ఆ తర్వాత... ఇప్పుడు దీనిలోనే నానపెట్టుకున్న హలీం గింజలు నీరు లేకుండా వేయాలి. వాటిని కూడా కాస్త వేయించి.. తర్వాత బెల్లం కూడా వేయాలి. చిన్న మంట మీద... అన్నింటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత.. లడ్డూల మాదిరి చుట్టుకుంటే సరిపోతుంది.
 

ఈ లడ్డూలను మనం ఏదైనా కంటైనర్ లో నిల్వ చేసుకొని తినవచ్చు. మరి.. ఈ లడ్డూ తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

ఈ లడ్డూలు మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్ , ఫోలిక్ యాసిడ్ కి  అద్భుతమైన మూలం అని నిపుణులు అంటున్నారు. మీరు వారానికి 1 లేదా 2 లడ్డూలను తీసుకుంటే, జుట్టు రాలడం, అలసట, తక్కువ హిమోగ్లోబిన్ సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, శరీరంలో ప్రోటీన్ ,రక్తం లేకపోవడంతో, జుట్టు రాలడం కూడా సంభవిస్తుంది, అయితే రక్తం లేకపోవడం వల్ల రక్తహీనత సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ లడ్డూలను తినడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. 

Latest Videos

click me!