how can get rid of pimples
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికోసం ప్రతి అమ్మాయి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ.. సరిగ్గా రేపు ఉదయం ఫంక్షన్ అనగానే.. ముఖంపై మొటిమ రావడం, లేదంటే.. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దాని వల్ల ఫంక్షన్ లో స్పెషల్ గా కనిపించాలనే కోరిక కాస్త ఆవిరైపోతుంది. ఎప్పుడూ లేనట్లు.. ఫంక్షన్ కి ముందు రోజే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా..? అయితే.. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట. ఈజీ బ్యూటీ హ్యాక్స్ ఇప్పుడు తెలుసుకుందాం...
1.మొటిమలు..
ఇప్పటికిప్పుడు ముఖంపై మొటిమ వస్తే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే.. ఆ మొటిమ పోవాలంటే కలబందతోనే సాధ్యం. కలబంద గుజ్జును ఐస్ క్యూబ్ లో పెట్టి.. గట్టిపడనివ్వాలి. తర్వాత దానిని ముఖంపై రుద్దితే.. మొటిమ కనపడదు. ఇలా కాసేపటి వరకు దానిని కంట్రోల్ చేయవచ్చు. అదే రోజూ చేస్తే.. పూర్తిగా తగ్గిపోతుంది.
2. గోరు విరిగిపోవడం..
చాలా మంది తమ గోళ్లను చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ గోరు విరిగిపోతే చాలా బాధపడిపోతారు. ఇలా జరిగితే.. గోరు విరిగిన ప్రాంతంలో టిష్యూ పేపర్ పెట్టి.. దాని మీద నెయిల్ కలర్ లో ఉండే నెయిల్ పాలిష్ వేయాలి. అది ఆరిన తర్వాత.. మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు.
3.బట్టతల..
బట్టతల అబ్బాయిలకు మాత్రమే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుంది. నుదుర దగ్గర.. చెవులకు పైనా జుట్టు ఊడిపోయి కనపడుతుంది. అలాంటప్పుడు ఆ ప్లేస్ లో.. మస్కరాతో.. మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే.. అక్కడ కొత్త వెంట్రుకలు వచ్చినట్లుగా కనపడుతుంది.
dark spots
4.ముఖం పై మచ్చలు..
సడెన్ గా ముఖంపై ఏదైనా మచ్చ వచ్చి.. అది ముఖం అందం పోగొడుతుందా..? అప్పుడు ఒక బ్రష్ తీసుకొని.. దానిపై టూత్ పేస్ట్ పెట్టి.. కొద్దిగా బేకింగ్ పౌడర్ చల్లాలి. తర్వాత.. దానిని ఆ మచ్చలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ మచ్చలను ఇన్ స్టాంట్ గా తొలగించవచ్చు.
shape of lips
5. పెదాలు పగలడం..
పెదాలు పగిలి.. లిప్ స్టిక్ వేసుకున్నా అందం లేకుండా ఉందా..? అలాంటప్పుడు టిష్యూ పేపర్ ని పాలల్లో ముంచి.. అవి పెదాలకు పెట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే.. పెదాలు మృదువుగా మారతాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే.. అందంగా కనపడుతుంది.