కలబందతో వీటిని కలిపి రాస్తే...రాత్రికి రాత్రికే ముఖం మెరిసిపోద్ది..!

First Published | Jul 28, 2024, 8:54 AM IST

కలబంద ఉంది కదా.. అని దానిని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం కాదు.. దానిలో కొన్ని పదార్థాలు అదనంగా కలిపి.. ముఖానికి రాయడం వల్ల.. మనం సహజంగా అందంగా మెరిసిపోవచ్చు అని నిపుణులు  చెబుతున్నారు. 

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా..? అందరూ అందంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే.. ఆ అందం పెంచుకోవడానికి ఎవరికివారు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో కి వచ్చే ప్రతి క్రీము, ఆయిల్  అంటూ ఏవేవో వాడేస్తూ ఉంటారు. కానీ.. మన కళ్ల ముందే.. మన అందాన్ని పెంచేవి ఉన్నాపట్టించుకోరు. మన ఇంట్లో.. పెరట్లో పెరిగే.. కలబంద మనకు మెరిసిపోయే అందాన్ని ఇస్తుందటే మీరు నమ్ముతారా..?
 

అంటే.. కలబంద ఉంది కదా.. అని దానిని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం కాదు.. దానిలో కొన్ని పదార్థాలు అదనంగా కలిపి.. ముఖానికి రాయడం వల్ల.. మనం సహజంగా అందంగా మెరిసిపోవచ్చు అని నిపుణులు  చెబుతున్నారు. మరి.. వేటితో కలిసి కలబంద గుజ్జు రాయడం వల్ల.. మన ముఖం రాత్రికి రాత్రే అందంగా మెరిసిపోతుందో తెలుసుకుందాం..


కలబంద  సౌందర్య సంరక్షణకు ఉత్తమమైన సహజ పదార్థాలలో ఒకటి. కలబందను క్రీమ్‌లతో సహా అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కలబంద చర్మ కణాల పునరుత్పత్తిని పెంచడానికి, ఎరుపును తగ్గించడానికి , చర్మం మంటతో పోరాడటానికి సహాయపడుతుంది.  క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ , మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది.

క‌ల‌బంద జెల్ తీసుకుని అందులో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది

ఒక టీస్పూన్‌ కలబంద గుజ్జులో, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
 

చర్మంలోని మలినాలను తొలగించేందుకు ముల్తానిమిట్టి ఉత్తమమైనది. ఇందులో ఉండే పదార్థాలు తరచుగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి అలాగే రంగు మారడానికి సహాయపడతాయి. ముఖంలోని జిడ్డును తగ్గించేందుకు ముల్తానిమిట్టి చాలా మంచిది. కొద్దిగా ముల్తానిమిట్టి , రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను బాగా మిక్స్ చేసి మీ ముఖం , మెడకు అప్లై చేయండి. 10 నిమిషాలు మసాజ్ చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.


రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు చర్మం వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. రెండు చెంచాల రోజ్ వాటర్,  అలోవెరా జెల్ కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం , మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేయాలి. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.

అలోవేరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్: ఒక కప్పులో అలోవెరా జెల్ (Aloevera gel), విటమిన్ ఇ క్యాప్సిల్ (Vitamin E capsule) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకుంటే మంగు మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

Latest Videos

click me!