గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తే ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 27, 2024, 12:06 PM IST

చాలా సార్లు గ్యాస్ స్టవ్ మంట చాలా చిన్నగా వస్తుంటుంది. ఇక ఆడవాళ్లు కంగారు పడిపోయి స్టవ్ ను రిపేర్ కు ఇస్తుంటారు. కానీ గ్యాస్ స్టవ్ మంట పెద్దగా వచ్చేలా మీరు కూడా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


వంటగదిలో మనం ఎక్కువగా ఉపయోగించే వాటిలో గ్యాస్ స్టవ్  ఒకటి. గ్యాస్ స్టవ్ లేకుండా ఏ చిన్న వంటను కూడా చేయలేం. రోజూ దీనిపై ఎన్నో వంటలు వండుతుంటాం. కాబట్టి దీనికి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా మంట చిన్నగా వస్తుంటుంది. దీనివల్ల స్టవ్ కు ఏమయ్యిందోనని రిపేర్ కు ఇస్తుంటారు. కానీ ఈ పనిని మీరు కూడా చేయొచ్చు. కొన్నిసింపుల్ చిట్కాలతో గ్యాస్ స్టవ్ మంచి చిన్నగా వస్తుంటే పెద్దగా వచ్చేలా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గ్యాస్ బర్నర్ ను ఎలా శుభ్రం చేయాలి? 

చాలా కాలం వాడిన తర్వాత గ్యాస్ బర్నర్లో దుమ్ము, మురికి పేలుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ స్టవ్ నెమ్మదిగా మండుతుంది. కాబట్టి బర్నర్ ను బాగా శుభ్రం చేయండి. బర్నర్ ను శుభ్రం చేయడానికి లోతుగా ఉండే పాత్రలో వేడి నీటిని తీసుకోండి. దీనిలో ఈనో వేయండి. ఇప్పుడు బర్నర్ ను ఈ నీటిలో ముంచి అరగంట పాటు అలాగే ఉంచండి. రెండు కంటే ఎక్కువ బర్నర్లు ఉంటే ఈనోను ఎక్కువగా వేయండి. అరగంట తర్వాత టూత్ బ్రష్ తో బర్నర్ ను శుభ్రం చేయండి. 


స్టవ్ పైపు

బర్నర్ శుభ్రం చేసిన తర్వాత కూడా గ్యాస్ స్టవ్ చిన్నగా మండుతున్నట్టైతే.. స్టవ్ ను ఆపేసి పైపును కూడా ఈనో వాటర్ లో నానబెట్టి శుభ్రం చేయండి. దీనివల్ల గ్యాస్ మంట బాగా మండుతుంది.
 

గ్యాస్ పైప్ లైన్ చెక్ చేయండి

కొన్ని కొన్ని సార్లు సిలిండర్ కు జతచేయబడిన పైపులో ఏదైనా లోపం లేదా లీకేజీ వల్ల గ్యాస్ స్టవ్ చిన్నగా మండుతుంది. కాబట్టి ప్రతి 3 నుంచి 5 నెలలకు ఒకసారైనా మీ గ్యాస్ పైపును మార్చండి. ఒకవేళ ఏదైనా లీకేజీ ఉంటే వెంటనే మార్చండి. 

Latest Videos

click me!