చాలా మంది అరటిపండ్లు, సపోటా తింటే బరువు పెరుగుతారు అనుకుంటారని.. కానీ తాను వాటిని ఇష్టంగా తింటానని కరీనా కపూర్ చెప్పారు. అరటి, సపోటాల్లో న్యూట్రియషన్స్ ఉంటాయని.. శరీరాకి అవసరమైన తక్షణ శక్తిని కూడా ఇవి అందిస్తాయని ఆమె చెప్పారు. ఎంత పని ఉన్నా, ఎక్కువగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఈ పండ్లు.. ఆ ఒత్తిడి తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయని ఆమె చెప్పారు. అందుకే వీటిని తాను క్రమం తప్పకుండా తింటానని కరిష్మా చెప్పడం విశేషం.