లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా ఉండాల్సినవి ఇవి..!

First Published | Feb 25, 2024, 11:51 AM IST

చాలా మంది ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్ ను జస్ట్ షోపీస్ గా మాత్రమే వాడుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగ్ లో కొన్ని వస్తువులు ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే? 
 

పనిచేసే ఆడవాళ్లందరి దగ్గర ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ లు ఉంటాయి. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు ఎంత ముఖ్యమో.. ఆడవారికి హ్యాండ్ బ్యాగ్ లు కూడా అంతే ముఖ్యం. అందుకే హ్యాండ్ బ్యాగులను ఆడవాళ్లకు ఫ్రెండ్ అనొచ్చు. అయితే కొంతమంది ఆడవాళ్ల హ్యాండ్ బాగుల్లో లిప్ స్టిక్, మేకప్ పౌడర్ వంటి బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. కానీ హ్యాండ్ బ్యాగ్ లో ఇవి కాకుండా ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి ఆడవాళ్లకు రక్షణగా ఉంటాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Office Handbags

హ్యాండ్ శానిటైజర్

బైక్, స్కూటీ, బస్సులు, ట్రైన్ అంటూ ఎన్నో విధాలుగా ఆఫీసులకు వెళుతుంటారు. జర్నీ చేసేటప్పుడు సీట్లను పట్టుకోవడం, అవీ ఇవీ ఎన్నో వస్తువులను ముట్టుకుంటుంటారు. దీనివల్ల చేతులకు ఎన్నో రకాల క్రిములు అంటుకుంటాయి. అలాగే చేతులు మురికిగా అవుతాయి. వెంటనే నీళ్లతో చేతులను కడుక్కోవడం వీలు కాదు. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో శానిటైజర్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
 


మౌత్ ఫ్రెష్నర్

ఆఫీసులో భోజన బ్రేక్ తర్వాత నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే మీ హ్యాండ్ బ్యాగ్ లో మౌత్ ఫ్రెష్నర్ ను ఉంచండి. ఇది మీ శ్వాసను తాజాగా ఉంచుతుంది. 

బ్యూటీ ప్రొడక్ట్స్

హ్యాండ్ బ్యాగ్ లో తప్పని సరిగా సన్ స్క్రీన్ లోషన్, లిప్ స్టిక్, లిప్ బామ్, కాజల్, వెట్ టిష్యూ ఇలా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉంచుకోవాలి. అవసరాన్ని బట్టి మీరు ఎప్పటికప్పుడు వాడుకోవాలి. 
 

చాక్లెట్

చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే మీ అలసట, ఆకలి మటుమాయం అవుతాయి. అందుకే అలసిపోయినట్టుగా అనిపిస్తే చిన్న చాక్లెట్ ముక్క తినండి. 

వాటర్ బాటిల్

వాటర్ బాటిల్ కూడా హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా ఉండాలి. బరువు కాకుండా అర లీటర్ వాటర్ బాటిల్ ను బ్యాగ్ లో ఎప్పుడూ క్యారీ చేయండి. నీళ్లు మీ దాహాన్ని తీరుస్తాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూస్తాయి. 

Office Handbags

మాత్ర

హ్యాండ్ బ్యాగ్ లో కొన్ని మాత్రలు ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా జ్వరం, తలనొప్పిని తగ్గించే మాత్రలను మీ హ్యాండ్ బ్యాంగ్ లో ఎప్పుడూ ఉంచండి. అవసరమైనప్పుడు వాడండి. లేదా అవసరంలో ఉన్నవారికి ఇవ్వండి. 

శానిటరీ న్యాప్ కిన్

ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగులో శానిటరీ న్యాప్ కిన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 

Image: Getty

పెప్పర్ స్ప్రే

పెప్పర్ స్ప్రే కూడా ఆడవారి హ్యాండ్ బ్యాగుల్లో ఉండాలి. ఇది మిమ్మల్ని ప్రమాదం నుంచి రక్షిస్తుంది. దీనిని రక్షణ ఆయుధంగా ఉపయోగించొచ్చు.

ఎటిఎమ్ కార్డు

సెల్ ఫోన్ పనిచేయకపోయినా, యూపీఐ వాడటంలో సాంకేతిక సమస్య వచ్చినా ఏటీఎం కార్డు మీకు ఉపయోగపడుతుంది.అందుకే మీ బ్యాగులో దీన్ని ఖచ్చితంగా ఉంచండి.  

Latest Videos

click me!