ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ వ్యాధేం కాదు. కానీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. పెరిగిన బరువును తగ్గించుకోకపోతే మాత్రం డయాబెటీస్, గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలతో పాటుగా ఎన్నో రోగాల బారిన పడతారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు మాత్రం బరువు అస్సలు పెరగరు. ఎందుకంటే వీళ్లు బరువు పెరగకుండా ఉండేందుకు ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. వీరిలో నయనతార ఒకరు. నయనతార ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే అందంగా, నాజుగ్గా ఉంది. అసలు ఈ బ్యూటీ ఇలా వెయిట్ ను ఎలా మెయిన్ టైన్ చేస్తుంది? ఈ హీరోయిన్ బరువు తగ్గే సీక్రేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
యోగా
హీరోయిన్ నయనతార ఎంత ఫిట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మీకు తెలుసా? ఈ హీరోయిన్ ప్రతి రోజూ యోగా చేస్తుంటుందట. యోగా అంటే ఈ బ్యూటీకి చాలా చాలా ఇష్టం. ఈ హీరోయిన్ జిమ్ లో గడిపే సమయం కంటే యోగాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
మంచి నిద్ర
హీరోయిన్ నయనతార నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. నిద్రతోనే హెల్తీగా ఉంటామన్న సంగతి ఈ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే నయనతార తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కంటినిండా నిద్రపోతారు.
జిమ్ లో శిక్షణ..
నయనతార ప్రతిరోజూ యోగా చేయడంతో పాటుగా జిమ్ కు కూడా వెళతారు. ఎంత బిజీగా ఉన్నా.. జిమ్ కు మాత్రం వెళ్లకుండా ఉండదట. ఆరోగ్యంగా ఉండటానికి వెయిట్ లిఫ్టింగ్ కూడా నయనతార ప్రాక్టీస్ చేస్తారట.
Nayanthara
ఫాస్ట్ ఫుడ్
నయనతార ఫాస్ట్ ఫుడ్ ను అస్సలు తినరు. ఈ బ్యూటీకి ఈ ఫుడ్ అస్సలు ఇష్టముండదట. ఈమె ఎప్పుడూ పౌష్టికాహారమే తింటుందట. అలాగే ఈ బ్యూటీ ఆహారపు అలవాట్లు చాలా సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఈ బ్యూటీ అన్ని హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తింటుంది.
కొబ్బరి నీరు
కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తారు. నయనతార ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తాగుతదట. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. నయనతార ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తప్పకుండా తాగుతారట.
ఆరోగ్యకరమైన ఆహారం
నయనతార ప్రత్యేకంగా ఎలాంటి డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వదు. కానీ రకరకాల కూరగాయలు, మాంసం, పండ్లు, గుడ్లు ఆమె రెగ్యలర్ ఫుడ్ లో ఉంటాయట. అందుకే నయనతార అంత హెల్తీగా ఉంటుందట. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే నయనతారలా ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి.