ఒకప్పుడు అయితే రోలు, రోకలితో చట్నీలను రుబ్బేవారు. కానీ ప్రస్తుతం పిండి, చట్నీల నుంచి ఎన్నో పదార్థాలను మెత్తగా రుబ్బడానికి మిక్సీలనే వాడుతున్నారు. మిక్సీలు వచ్చిన తర్వాత రోలు, రోకలిని వాడేవారు లేకుండా పోయారు. మిక్సీల రకాతో ఆడవారికి చాలా శ్రమ తగ్గింది. ఇవి సెకన్లు, నిమిషాల్లోనే మనకు కావాల్సిన పదార్థాలను మెత్తగా రుబ్బుతాయి. అందుకే ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీలు కనిపిస్తాయి.