జుట్టు ఊడిపోకుండా ఉండాలని, పొడుగ్గా పెరగాలని చాలా మంది మార్కెట్ లోకి వచ్చిన ప్రతి నూనెను, షాంపూలను ట్రై చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. నిజానికి జుట్టు ఊడిపోవదన్నా.. పొడుగ్గా పెరగాలన్నా మీరు మంచి ఫుడ్ ను తీసుకోవాలి. అవును ఫుడ్ ద్వారానే మన వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. విటమిన్ బి 7 అని కూడా పిలువబడే బయోటిన్ అనేది నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది మన జుట్టును , చర్మాన్ని, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ రోజువారి ఆహారంలో బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చితే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.