కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా..? ఇది ఒక్కటి రాస్తే.. వారంలో మాయం..!

First Published | Aug 6, 2024, 2:06 PM IST

 మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో.. సులభంగా వాటిని తొలగించవచ్చని మీకు తెలుసా? మరి.. ఏం రాస్తే.. ఈ డార్క్ సర్కిల్స్ శాశ్వతంగా మాయం అవుతాయో ఇప్పుడు చూద్దాం...

dark circles

ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మనం మంచి డ్రెస్, మ్యాచింగ్ జ్యూవెలరీ ఇలా అన్నీ  సెట్ చేసుకుంటాం. తీరా అన్ని వేసుకున్నా కూడా ముఖం మాత్రం డల్ గా కనపడుతుంది. అందుకు కారణం లేకపోలేదు. మన కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్. మనం ఎంత సంతోషంగా ఉన్నా, ఎన్ని క్రీములు రాసినా.. మన కంటి కింది డార్క్ సర్కిల్స్ మాత్రం కళ తప్పేలా.. నీరసంగా, ఏదో రోగం వచ్చిన వారిలా కనిపించేలా చేస్తాయి.

dark circles

మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల మనకు  ఈ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. రావడం అయితే.. వెంటనే వచ్చేస్తాయి కానీ.. పోవడం మాత్రం తొందరగా పోవు. చాలా మంది.. ఆ కంటి కింది డార్క్ సర్కిల్స్ పోవడానికి ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. కానీ.. వాటికన్నా.. మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో.. సులభంగా వాటిని తొలగించవచ్చని మీకు తెలుసా? మరి.. ఏం రాస్తే.. ఈ డార్క్ సర్కిల్స్ శాశ్వతంగా మాయం అవుతాయో ఇప్పుడు చూద్దాం...


1.బంగాళదుంప..
చాలా మంది ఫేవరేట్ కూరగాయ ఇది. దీనితో ఎన్ని రకాల రెసిపీలు చేయవచ్చో. ఇదే బంగాళదుంప మన అందాన్ని కూడా పెంచుతుంది. కంటి కింది డార్క్ సర్కిల్స్ పై బంగాళదుంప రసం రాయడం వల్ల.. వాటిని ఈజీగా  తగ్గిపోతాయట. బంగాళాదుంపలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్‌తో నిండి ఉంటాయి, ఇవి మీ చర్మానికి చాలా అవసరమైన పోషకాలను అందిస్తాయి. మీరు చేయాల్సిందల్లా తెల్ల బంగాళాదుంపను తురిమి.. దాని రసాన్ని వడకట్టడం. ఈ రసాన్ని కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఇది నలుపు మార్క్ ని తగ్గించి కంటికి అందాన్ని ఇస్తుంది.
 

2.కలబంద...
అలోవెరా జెల్ సహజంగా ఉండే దానిని ఎంచుకోవాలి. ఇది మీ కళ్ల చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ ని ఈజీగా తగ్గించడంలో సహాయపడుతుంది., కలబంద మన చర్మాన్ని  హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది . కంటి కింద చర్మాన్ని మరింత మృదువుగా చేస్తుంది, తద్వారా మంటను తగ్గిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా, మీరు కళ్ల చుట్టూ అలోవెరా జెల్‌ను సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఈ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా చేయడానికి నిమ్మరసం, తేనె లేదా రోజ్ వాటర్ వంటి ఇతర పదార్థాలతో కలబంద రసాన్ని కలపాలని డాక్టర్ జంగ్డా సూచిస్తున్నారు.

almond oil

3.బాదం నూనె.. బాదం నూనె కేవలం జుట్టు కి మాత్రమే రాయాలి అని ఎవరు చెప్పారు..? మీ డార్క్ సర్కిల్‌ ను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.  బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 

milk and safron

4. కుంకుమపువ్వు కుంకుమపువ్వు కేవలం ఆహారానికి మాత్రమే కాదు, మీ అందానికి కూడా గొప్ప జోడింపు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2-3 కుంకుమపువ్వును చల్లటి పాలలో నానబెట్టి, కాటన్ బాల్ ఉపయోగించి కళ్ల చుట్టూ అప్లై చేయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌లు రెండూ పుష్కలంగా ఉన్నందున, కుంకుమపువ్వు కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి వలయాలను తగ్గిస్తుంది. 

Latest Videos

click me!