రాత్రిపూట ఈ 2 పనులు చేస్తే ఉదయానికల్లా మీ ముఖం అందంగా కనిపిస్తుంది

First Published | Aug 14, 2024, 10:57 AM IST

ప్రతిఒక్కరూ తమ ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం వదులుగా మారుతుంది. దీంతో ముఖ అందం తగ్గుతుంది. అయితే మీరు రాత్రిపూట రెండు పనులను చేస్తే ఈ సమస్య అస్సలు ఉండదు.
 

skin care

అబ్బాయిల కంటే అమ్మాయిలే అందంగా కనిపించాలని ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అందంగా, యవ్వనంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కొంతమంది ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవుతుంటారు. ఎన్ని క్రీమ్స్ ను వాడినా.. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం వదులుగా మారుతుంది. దీనివల్ల మీరు ఎంత అందంగా రెడీ అయినా.. అందంగా మాత్రం కనిపించరు. చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చాలా మందికి చిన్నవయసులోనే ఈ సమస్య వస్తుంది. అయితే మీరు నైట్ స్కిన్ కేర్ రొటీన్ ను ఫాలో అయితే మాత్రం మీ ముఖం అందంగా, యవ్వనంగా  మారిపోతుంది. 

skin care

చర్మ నష్టానికి కారణాలు 

ఒక నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత మన ముఖం చర్మం సన్నబడటం ప్రారంభమవుతుంది. అలాగే మారుతున్న జీవనశైలి, చెడు ఆహారాలను తినడం వల్ల కూడా చర్మం పల్చబడుతుంది. అలాగే చర్మం వదులుగా మారుతుంది. 

Latest Videos


చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? 

మీ ముఖ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు ఒత్తిడికి అస్సలు గురికాకూడదు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అలాగే మీరు నీరు పుష్కలంగా తాగాలి. నీళ్లు మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతుంది.

skin care


వ్యాయామం 

స్కిన్ కేర్ తో మీ ముఖం వదులుగా కాకుండా.. బిగుతుగా మార్చుకోవడానికి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటారు నిపుణులు. వ్యాయామం మీ చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. 


నైట్ స్కిన్ కేర్ ముఖ్యం 

మీ ముఖ చర్మాన్ని బిగుతుగా మార్చడానికి నైట్ స్కిన్ కేర్ చాలా చాలా అవసరం. ఇది మీ ముఖాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ ముఖంపై మొటిమలు, మచ్చలు  వంటి సమస్యలను కూడా నయంచేస్తుంది. 

skin care


కలబంద జెల్

కలబంద జెల్ ముఖానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రాత్రిపూట ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారిపోతుంది. అలాగే ఇది మీ ముఖాన్ని బిగుతుగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

skin care

పచ్చి పాలు 

మీ ముఖం బిగుతుగా ఉండాలంటే పచ్చి పాలను ఉపయోగించండి. ఇందుకోసం పచ్చి పాలను కాటన్ సహాయంతో ప్రతిరోజూ రాత్రి ముఖానికి అప్లై చేయండి. ఈ పాలు ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. 

ముఖానికి మసాజ్

ముఖాన్ని బిగుతుగా మార్చడానికి మసాజ్ కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖాన్ని రోజూ కాసేపు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. 

click me!