మీ రెగ్యులర్ షాంపూలో ఈ మూడు కలపండి.. ఒత్తైన జుట్టు ఇక మీదే..!

First Published Aug 13, 2024, 2:00 PM IST

మనం వాడే నార్మల్ షాంపూతోనే అది కూడా సాధ్యం. అయితే.. అందులో కేవలం ఓ మూడు వస్తువులు చేర్చితే సరిపోతుంది. మరి, అవేంటి..? వాటిని ఎలా వాడితే.. మీ జుట్టు అందంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఖరీదైన నూనెలు, షాంపూలు వాడేస్తూ ఉంటాం. వాటి వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది సంగతి పక్కన పెడితే.. ఖర్చు మాత్రం కాస్త ఎక్కువగానే పెట్టాల్సి వస్తుంది.  కానీ.. పెద్దగా ఖర్చు లేకుండా.. మన జుట్టును ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా మార్చుకోవచ్చని మీకు తెలుసా?
 

Moisturise your hair

మనం వాడే నార్మల్ షాంపూతోనే అది కూడా సాధ్యం. అయితే.. అందులో కేవలం ఓ మూడు వస్తువులు చేర్చితే సరిపోతుంది. మరి, అవేంటి..? వాటిని ఎలా వాడితే.. మీ జుట్టు అందంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Latest Videos



రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్  దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె.. ఈ మూడు మీ షాంపూని చాలా పవర్ ఫుల్ గా మార్చేస్తాయి. మీ  రెగ్యులర్ షాంపూలు ఈ మూడింటినీ మిక్స్ చేసి మరీ తలస్నానం చేశారు అంటే.. మీ జుట్టు సమస్యలన్నీ తీరిపోయినట్లే.
 

దీనికోసం.. మీరు తలస్నానం చేయడానికి  ఎంత షాంపూ అవసరమో ఒక గిన్నెలో తీసుకోవాలి.  తర్వాత.. అందులో ముందుగా మనం చెప్పుకున్న రెండు టీ స్పూన్ల కాఫీ పొడి, దాల్చిన చెక్క పొడి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా తలకు, మీ జుట్టుకు బాగా పట్టించాలి. తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఇక.. ఇలా.. ఈ మిశ్రమాన్ని మీరు కనీసం వారానికి రెండు సార్లు అయినా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడవుగా, బలంగా పెరుగుతుంది. 

కాఫీ పొడితో జుట్టు పెరగడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది.  ఇలా కాఫీ పొడి కలపడం వల్ల జుట్టు ఊడటం తగ్గుతుంది. తర్వాత.. కొత్త వెంట్రుకలు రావడం మొదలౌతున్నాయి.
 

కాఫీ పొడి మాత్రమే కాదు.. దాల్చిన చెక్క పొడి కూడా మన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. సహజంగా.. జుట్టుకు యాంటీ ఆక్సిడెంట్స్ అందించి.. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా సహాయపడతాయి. కనీసం రెండు మూడు, వారాలు ప్రయత్నించి చూడండి.. కచ్చితంగా రిజల్ట్ చూస్తారు. 

click me!