ముఖానికి నెయ్యి రాసుకుంటే ఏమౌతుంది..?

First Published | Aug 13, 2024, 12:05 PM IST

ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించడానికీ, మొటిమల సమస్య తగ్గించడానికి, వయసు రిత్యా వచ్చే గీతలు కూడా పోతాయి. దాని వల్ల వయసు తగ్గి.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు.

నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి మాత్రమే అందాన్ని మెరుగుపరచడంలోనూ నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందట.  మన ముఖాన్ని మెరిసేలా చేయడంలో నెయ్యి  చాలా బాగా ఉపయోగపడుతుందట. మరి ఈ నెయ్యిని ముఖానికి ఎలా రాయాలి..? ఎలా రాస్తే అందం మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

ghee

ప్రతిరోజూ ముఖానికి మాయిశ్చరైజర్ లాగా  రాసుకోవాలట. ఇలా రాయడం వల్ల.. మీ ముఖం చాలా మృదువుగా మారుతుంది. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్.. మన చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. వాటితో పాటు...  ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించడానికీ, మొటిమల సమస్య తగ్గించడానికి, వయసు రిత్యా వచ్చే గీతలు కూడా పోతాయి. దాని వల్ల వయసు తగ్గి.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు.

Latest Videos


ghee

నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మానికి తెలియని ఓ గ్లోని తీసుకువస్తాయి. చర్మం అందంగా మారడానికి సహాయపడుతుంది. మునుపటి కంటే. మీ చర్మం ఎక్కువగా అందంగా మెరుస్తూ కనపడుతుంది.

వయసు పెరుగుతుంటే.. మన ముఖంపై ముడతలు రావడం చాలా సర్వ సాధారణం. అయితే.. ఆ ముడతలను తొలగించడానికి మనం ఏవేవో క్రీములు రాయాల్సిన అవసరం లేదు.. కేవలం.. రెగ్యులర్ గా ముఖానికి నెయ్యి రాసినా చాలు. ముఖానికి గ్లో తేవడమే కాదు.. ముఖంపై ముడతలు మాయం అవుతాయి.

కాలంతో సంబంధం లేకుండా  చాలా మందికి డ్రై స్కిన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ.. రెగ్యులర్ ముఖానికి నెయ్యి రాయడం వల్ల..  డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. చర్మం మంచిగా మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది. మృదువుగా ఉంటుంది.

click me!