వర్షాకాలంలో ముఖానికి ఏం రాస్తే.. అందంగా ఉంటుందో తెలుసా?

First Published | Jul 21, 2024, 9:48 AM IST

ఇతర సీజన్లతో పోలిస్తే ఒక్క వానాకాలంలోనే చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం పొడిబారడం, ముఖంపై నల్ల మచ్చలు, తెల్లమచ్చలు ఎక్కువగా అవుతుంటాయి.అలాగే చర్మ రంగు కూడా మారుతుంది. అయితే  మీరు ఈ సీజన్ లో కొన్నింటిని ముఖానికి అప్లై చేయడం వల్ల అందంగా ఉంటుంది.

వేరే కాలాల కంటే వర్షాకాలంలోనే చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా మొఖంపై మొటిమలు ఏర్పడటం, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, చర్మం పొడిబారడం, రంగు మారడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే సమస్యలను తగ్గించుకోవడానికి మీరు కొన్ని రకాల వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది. అవును ఇవి మీ ముఖానికి మంచి రంగును ఇచ్చి అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే మొటిమలను, డ్రైనెస్ ను తగ్గిస్తాయి. అందుకే వానాకాలంలో ముఖానికి ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఫేస్ వైప్స్

ఫేస్ వైప్స్  మన ముఖానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముందే వర్షాకాలంలో ముఖంపై జిడ్డు బాగా పెరుగుతుంది. ఈ జిడ్డును తొలగించడానికి మీరు ఫేస్ వైప్స్ ను ఉపయోగించొచ్చు. వీటిలో పాటుగా రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ ను కూడా ఉపయోగించండి.

Latest Videos


కలబంద

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో రకాల చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. మీకు తెలుసా? కలబందను మీరు ప్రతి సీజన్‌లో కూడా ఉపయోగించొచ్చు. ఎందుకంటే ఇది మన ముఖంపై తేమను కాపాడుతుంది. అలాగే చర్మాన్ని చల్లబరుస్తుంది. తేమగా ఉంచుతుంది. దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. 
 

బంక మట్టి

ముల్తానీ మట్టి మన ముఖానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఈ సీజన్‌లో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని మెరిసేలా చేసి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. 
 

తేనె

వర్షాకాలంలో తేనెను ముఖానికి రాసుకోవడం చాలా మంచిదని ఎంతో మంది అంటారు. తేనే ఫేస్ ప్యాక్‌ను  తయారుచేసి ఉపయోగించొచ్చు. ఇది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అందంగా కూడా చేస్తుంది.
 

గంధం పొడి

గంధంపొడిని వర్షాకాలంలో ముఖానికి అప్లై చేయడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గంధం పొడిలో ఉండే  యాంటీ ఏజింగ్ గుణాలు ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇది చర్మశుద్ధికి కూడా సహాయపడుతుంది. 

బంగాళదుంప రసం

ముఖాన్ని శుభ్రం చేయడానికి మీరు బంగాళాదుంప రసాన్ని కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఆలుగడ్డ రసాన్ని  ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇది మీ ముఖంపై మచ్చలను పోగొడుతుంది. మొటిమలను తగ్గిస్తుంది. 
 


పసుపు

వర్షాకాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ముఖానికి పసుపును రాసుకోవాలని నిపుణులు అంటారు. దీనికోసం తేనె, రోజ్ వాటర్‌లో కొద్దిగా పసుపును కలిపి ముఖానికి రాసుకోవాలి.
 

click me!