తల్లి కాబోతున్న దీపిక పదుకొనే.. ఏం తింటుందంటే?

First Published | Jul 19, 2024, 12:46 PM IST

దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆకలి కోరికలు పెరగడం, కొన్ని ఆహారాలను తినాలనిపించకపోవడం వంటి సమస్యలువ వస్తాయి. ఇది చాలా కామన్. మరి దీపికా పదుకొనే ఎలాంటి ఆహారాలను తింటుందో తెలుసా? 
 

ప్రగ్నెంట్ గా ఉండటం మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. ఈ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేము. ప్రతి మహిళ దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది. కానీ ప్రెగ్నెంట్ సమయంలో ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్ల మార్పులు, ఆకలి పెరగడం, బరువు పెరగడం, చిరాకు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇది అందరికీ జరిగేదే. ఇకపోతే ఈ సమయంలో ఇది తినాలి, అది తినాలి అన్న కోరికలు బాగా కలుగుతాయి. మరి ప్రగ్నెంట్ అయినా.. దీపికా ఈ సమయంలో ఏమేమి తింటుందో తెలుసా?  
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి దీపికా తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అందులోనూ ఈ బ్యూటీ ప్రగ్నెంట్ అయ్యి కూడా.. కల్కి ప్రమోషన్స్ లో కూడా హుషారుగా పాల్గొన్నది. కాగా ఈమె ప్రగ్నెన్సీపై కూడా ఎన్నో కామెంట్లు వినిపించాయి. అయినా వాటినేమీ లెక్కచేయకుండా దీపికా ఈ టైంను ఎంజాయ్ చేస్తోంది. 



దీపికా, రన్ వీర్ సింగ్ లకు 2018 లో పెళ్లి అయ్యింది. పెళ్లైనా దీపికా పదుకొనే సినిమాల్లో కంటిన్యూగా నటిస్తూనే వచ్చింది. మొన్నటికి మొన్న ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కూడా యాక్ట్ చేసింది. దీనిలో దీపికా ఏ రేంజ్ లో నటించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
 

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ దంపతులు ఈ సంవత్సరం సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం దీపిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దానిలో దీపికా స్నాక్స్, స్వీట్ల ఫొటోను షేర్ చేసింది.
 

'డైట్' అనే పదం చుట్టూరా ఎన్నో అపార్థాలు ఉన్నట్టు అనిపిస్తోంది. 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం, మనకు ఇష్టం లేని ఆహారాలన్నింటినీ తినడం అని మనలో చాలా మంది నమ్ముతారు. నిజానికి 'డైట్' అంటే నిజంగా ఒక వ్యక్తి తినే ఆహారం, పానీయాల మొత్తం. ఈ పదం వాస్తవానికి గ్రీకు పదం "డైటా" నుండి వచ్చింది. అంటే "జీవన విధానం" అని అర్థం.
 

నేను ఎప్పుడూ కూడా, నాకు గుర్తున్నంత వరకు సమతుల్య ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇదే నా జీవన విధానం. నేను వ్యామోహం కలిగించే ఆహారాలను నేను ఎప్పుడూ తినలేదని దీపికా చెబుతోంది. 

Latest Videos

click me!