ఈ రకం మల్లెపువ్వు వాడితే.. మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడం ఖాయం..!

First Published | Jul 19, 2024, 1:57 PM IST

మనం ఒక రకమైన మల్లె పువ్వును వాడే విధంగా  వాడితే.. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి. జుట్టు రాలడం తగ్గడమే కాదు.. ఒత్తుగా పెరుగుతుంది.. తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుందట. మరి అది ఏ మల్లెపువ్వు..దానిని ఎలా వాడాలో తెలుసుకుందాం..
 

జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే ఉంటారు. కానీ.. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం, మన లైఫ్ స్టైల్, కెమికల్స్ ఉండే ఉత్పత్తులు వాడటం.. ఇలా పలు కారణాల వల్ల జుట్టు తొందరగా ఊడిపోవడం, చిన్న వయసులోనే తెల్లగా మారడం లాంటివి జరుగుతున్నాయి.  అయితే... మనం ఒక రకమైన మల్లె పువ్వును వాడే విధంగా  వాడితే.. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి. జుట్టు రాలడం తగ్గడమే కాదు.. ఒత్తుగా పెరుగుతుంది.. తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుందట. మరి అది ఏ మల్లెపువ్వు..దానిని ఎలా వాడాలో తెలుసుకుందాం..
 


మల్లె పువ్వు మన అందరికీ తెలుసు. కానీ.. దీనిని మొగ్రా మల్లె పువ్వు అంటారట.  దీని వాసన చాలా బాగుంటుంది. అన్ని మల్లెల్లోకెల్లా ఎక్కువ సువాసన వస్తుంది. ఈ మల్లె పువ్వులో చాలా సహజమైన లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  ఈ మొగ్రా మల్లెపువ్వు నుంచి తీసిన నూనె రాయడం వల్ల.. జుట్టు ఊడటం అనేది ఉండదట.
 



మీకు మార్కెట్‌లో మొగ్రా పూల నూనె దొరుకుతుంది. జుట్టు సంరక్షణకు ఇది అద్భుతమైన నూనె. దీన్ని తయారు చేయడానికి, మీకు తాజా మొగ్రా పువ్వులు అవసరం, వాటిని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో నానబెట్టండి. 2-3 రోజులు ఎండలో ఉంచండి, తద్వారా పువ్వుల లక్షణాలన్నీ నూనెలోకి వస్తాయి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా , మెరుస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో తలకు మసాజ్ చేయండి. రాత్రంతా ఈ నూనెను జుట్టు మీద ఉంచండి.మరుసటి రోజు షాంపూ చేస్తే సరిపోతుంది.  ఈ నూనె వాడితే.. తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు.
 

మొగ్రా మల్లెపూల నూనె మాత్రమే కాదు.. షాంపూ కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే.. ఇంట్లోనే ఈ పూల రసం తీసి షాంపూ తయారు చేసుకోవచ్చు.  ఈ పూల షాంపూ వాడటం వల్ల.. జుట్టులో జిడ్డు, మురికి వదలడంతో పాటు.. జుట్టుకు మంచి పోషణ కూడా లభిస్తుంది.

మొగ్రా పూలతో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించి కూడా మీ జుట్టు అందాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం మొగ‌ర పువ్వుల‌ను పేస్ట్‌లా చేసి అందులో పెరుగు, తేనె, కోడిగుడ్డు సొన వేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తరువాత, జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును మృదువుగా, ఒత్తుగా , మెరిసేలా చేస్తుంది. జుట్టుకుదుళ్లు బలపడేలా, హెయిర్ స్మూత్ గా మారేలా సహాయం చేస్తాయి.


మొగ్రా పూలతో సహజసిద్ధమైన కండీషనర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మొగ్ర పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో జుట్టును కడగాలి. ఈ కండీషనర్ జుట్టును మృదువుగా చేస్తుంది. దానికి మెరుపును కూడా ఇస్తుంది. .జుట్టుకు మంచి సువాసనతో పాటు.. మంచి కండిషనింగ్ కూడా అందిస్తుంది. 

Latest Videos

click me!