మనలో చాలా మంది దుస్తుల కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అయితే... లో దుస్తుల విషయంలో మాత్రం శ్రద్ధ వహించరు. దాని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వేసుకునే లో దుస్తుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలట.
undefined
మామూలుగా రోజువారి ధరించే లోదుస్తులు వర్షాకాలంలో ధరించకూడదట. మరి ఎలాంటి లోదుస్తులు వేసుకోవాలి..? వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
undefined
వర్షాకాలంలో లోదుస్తులు త్వరగా ఆరవు. ఉతికిన దుస్తులు ఎండటానికి కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. అలా రెండు, మూడు రోజులు బయట ఉన్నవాటిని ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట.
undefined
వర్షాకాలంలో లోదుస్తులు త్వరగా ఆరవు. ఉతికిన దుస్తులు ఎండటానికి కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. అలా రెండు, మూడు రోజులు బయట ఉన్నవాటిని ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట.
undefined
అలా కాదని.. పూర్తిగా ఎండకుండా.. తడిగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల బాక్టీరియా తయారై.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు సంభవించే ప్రమాదం ఉంది.
undefined
కేవలం వేసవిలో మాత్రమే కాదు.. వర్షాకాలంలో కూడా వ్యాయామం చేసిన తర్వాత కాళ్ల దగ్గర చమటలు వస్తాయి. అప్పుడు లో దుస్తులు తడిచిపోతాయి. వాటిని అలానే ఉంచుకుంటే.. దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. వ్యాయామం తర్వాత వెంటనే లో దుస్తులు మార్చుుకోవాలి.
undefined
ఇక బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించకూడదు. దాని వల్ల రక్త ప్రవాహం సరిగా జరగదు. కాబట్టి.. బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించకూడదు. కొద్దిగా వదులుగా ఉండే దుస్తులను ధరించడమే ఉత్తమం.
undefined
లోదుస్తుల్లో చాలా రకాల క్లాత్ లతో తయారు చేస్తున్నారు. కానీ వాటికన్నా.. స్వచ్ఛమైన కాటన్ తయారు చేసిన వాటిని ధరించడం ఉత్తమం.
undefined
లోదుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలతో ఉండే డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది. వాటిలోని కెమికల్స్.. ఇన్ఫెక్షన్లుకు కారణం కావచ్చు.
undefined