పెరుగుతో పెంచుకోండి అందం..!

First Published | Jul 20, 2021, 12:21 PM IST

మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు. 

వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది. కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.
undefined

Latest Videos


ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.
undefined
బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.
undefined
అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.
undefined
ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.
undefined
click me!