పీరియడ్స్ టైంలో ఏం చేయొద్దో తెలుసా?

First Published Sep 7, 2024, 11:46 AM IST

పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తిమ్మిరితో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఏ పనులూ చేయలనిపించవు. అయితే కొంతమంది పీరియడ్స్ టైంలో కూడా చేయకూడనివి చేస్తుంటారు. 

ప్రతి మహిళకు పీరియడ్స్ అనేవి చాలా కామన్. కానీ ఈ సమయంలో పొత్తి కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్, తిమ్మిరి వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పీరియడ్స్ టైంలో బలహీనంగా, చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. అయితే అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేం. కొంతమందికి ఈ సమస్యలేమీ ఉండవు. కానీ కొంతమందికి మాత్రం ఈ పీరియడ్స్ టైం చాలా కష్టంగా గడుస్తుంది. అయితే చాలా మందికి ఈ టైంలో ఏం చేయాలో? ఏం చేయకూడదో? తెలియదు. దీనివల్లే వీరు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


పీరియడ్స్ సమయంలో పొరపాటున కూడా ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చాలా మంది చెప్తుంటారు. ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుందని నమ్ముతారు. కానీ పీరియడ్స్ టైంలో కూడా మీరు తేలికపాటి వ్యాయామం, యోగా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ పొత్తికడుపు ప్రాంతాన్ని విస్తరిస్తుంది. 

పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇదే కాకుండా యోగా చేయడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. నెలసరి నొప్పి కూడా  తగ్గుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. 

Latest Videos



చాలా మంది వాడే ప్యాడ్లు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అని తెలుసుకోకుండా గుడ్డిగా వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ ఆకృతి ప్యాడ్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి దద్దుర్లు, ఎరుపు, చికాకు వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే యోని ప్రాంతానికి గాలి ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే మంచి పరిశుభ్రత, సౌకర్యం కోసం సహజ పదార్ధాలతో తయారైన కాటన్ ప్యాడ్లను వాడండి. 

పీరియడ్స్ టైంలో చిప్స్, బర్గర్లు, ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. పీఎంఎస్ లక్షణాలను కూడా ఎక్కువ చేస్తాయి. అందుకే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చాక్లెట్ వంటి వాటిని తినొచ్చు. 
 

periods

పీరియడ్స్ టైంలో టీ, కాఫీలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలోని కెఫిన్ కంటెంట్ పీఎంఎస్ లక్షణాలను పెంచుతుంది. అలాగే ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను కూడా పెంచుతుంది.

టీ, కాఫీలు యాంగ్జైటీ, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే టీ, కాఫీలకు బదులుగా అల్లం టీ లేదా సోంపు-జీలకర్ర టీ వంటి మూలికా టీలను తాగండి. 

మరొక ముఖ్యమైన విషయమేంటంటే? చాలా మంది ఆడవారు ఒకే ప్యాడ్ ను లేదా టాపోన్ ను రోజంతా లేదా సగం రోజు వరకు ఉంచుకుంటారు. ప్యాడ్ మురికిగా కాకున్నా, బ్లీడింగ్ లేకున్నా.. ఒకే ప్యాడ్ ను ఎక్కువ సేపు ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి ప్యాడ్ ను ఖచ్చితంగా మార్చాలి. 
 

periods

పీరియడ్స్ టైం కి రావాలంటే ఏం చేయాలి? 

పీరియడ్స్ టైంకి వస్తేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. సాధారణంగా 28 రోజుల్లో పీరియడ్స్ వస్తుంటాయి.

కానీ కొంతమందికి 24 నుంచి 35 రోజుల తర్వాత పీరియడ్స్ వస్తాయి. దీనివల్ల వచ్చే సమస్య ఏం లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు నెల, రెండు నెలలు అయినా పీరియడ్స్ మాత్రం రావు.

ఒత్తిడి, పీసీఓడీ, ఫైబ్రాయిడ్, థైరాయిడ్ తో ఎన్నో కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. కొన్ని కొన్ని సార్లు శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కూడా పీరియడ్స్ టైంకి రావు. అయితే మీరు ఒక టీని తాగితే పీరియడ్స్ సమయానికి వస్తాయి. అదేంటంటే? 

కావాల్సిన పదార్థాలు

కుంకుమపువ్వు - 2-3 దారాలు
బెల్లం - 1 టీ స్పూను
మెంతులు - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - 1 టీ స్పూను
జీలకర్ర - 1 టీ స్పూను
నీరు - 200 మి.లీ.

తయారుచేసే విధానం

బెల్లం తప్ప మిగతావన్నీ సగానికి తగ్గే వరకు నీటిలో వేసి మరిగించండి. తర్వాత దీన్ని వడకట్టి అందులో బెల్లం వేసుకుని తాగండి. 

మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. మెంతులు పీరియడ్ చక్రాన్ని నియంత్రిస్తాయి. దీనివల్ల మీ శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పీరియడ్స్ సమయానికి అవుతాయి. ఇకపోతే జీలకర్ర పీరియడ్స్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో రకాల ఎంజైమ్లు ఉంటాయి.  ఇది పీరియడ్స్ ను రెగ్యులర్ గా ఉంచుతుంది. ఇక కుంకుమ పువ్వు పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో కొత్తిమీర ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బెల్లం కూడా ఇందుకు సహాయపడుతుంది. 

click me!