Cockroaches
బొద్దింకలు లేని ఇల్లంటూ లేదు అని అంటే వినడానికి ఆశ్యర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. వంటగదుల్లో చీమలు,ఈగలతో పాటుగా బొద్దింకల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. బొద్దింకలే కదా వీటివల్ల ఏం జరుగుతుంది అని తేలిగా తీసిపడేయడానికి లేదు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాల పైన తిరుగుతూ మనల్ని అనేక రోగాల భారిన పడేలా చేస్తాయి. వీటిని శాశ్వతంగా వంటగది నుండి తరిమికొట్టడానికి చిన్న చిన్ని చిట్కాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు . అవి ఎంటో ఇప్పుడు తెలుసుకుందా..
కిరోసిన్: కిరోసిన్ ఒక్క వంటచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఎన్నో పనులకు కూడా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? దీన్ని ఉపయోగించి మీరు వంటింట్లో ఉండే బొద్దింకలను చాలా ఈజీగా బయటకు పంపొచ్చు.
కిరోసిన్ వాసన బొద్దికలను అస్సలు నచ్చదు. ఇది వంటింట్లో ఉంటే బొద్దింకలు అటువైపే రావు. ఇందుకోసం వంటింట్లో ప్రతి మూల, తలుపు దగ్గర, డ్రైనేజీ దగ్గర కిరోసిన్ ను కొంచెం కొంచెం కింద పోయండి. దీని వాసనకు బొద్దింకలు ఇంట్లో లేకుండా పోతాయి.
cockroaches
వేప నూనె: వేపనూనెతో కూడా ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా పోతాయి. ఇందుకోసం వేపనూనెను వంటింట్లో బొద్దింకలు వచ్చిపోయే చోట పిచికారి చేయాలి. బొద్దింకలను వెళ్లగొట్టడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని వంటింట్లో ప్రతి మూల, బొద్దింక ప్రాంతాల్లో చల్లండి.
బోరిక్ పౌడర్: బోరిక్ పౌడర్ తో కూడా మీరు వంటింట్లో ఉన్న బొద్దింకలను తిరిమికొట్టొచ్చు. ఇందుకోసం బోరిక్ పౌడర్ ను పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని వంటింట్లో ప్రతి మూలలో, బొద్దింకలు తిరిగే చోట పెట్టండి. వీటివల్ల బొద్దింకలు ఎప్పటికీ మీ వంటింట్లోకి రావు.
cockroaches
బిర్యానీ ఆకులు: బిర్యానీ ఆకులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఈ మసాలా దినుసు ఒక్క వంటకు మాత్రమే కాదు.. మరెన్నింటికో ఉపయోగపడుతుంది. అవును వీటిని ఉపయోగించి వంటింట్లో ఉన్న బొద్దింకలను తిరిమికొట్టొచ్చు.
ఇందుకోసం బిర్యానీ ఆకులను పౌడర్ లా చేయండి. ఈ పొడిని నీళ్లలో వేసి వంటింట్లో స్ప్రే చేయండి. ఇది బొద్దింకలను వంటింట్లో నుంచి వెళ్లగొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వెనిగర్: వెనిగర్ ను ఉపయోగించి కూడా మీరు ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేయొచ్చు. బొద్దింకలు ఎక్కువగా కిచెన్ సింక్ లోపల, వంటింట్లో ఎక్కువగా తిరుగుతాయి. అక్కడే పెరుగుతాయి. అందుకే వెనిగర్ ను వేడినీళ్లలో కలిపి అక్కడక్కడ స్ప్రే చేయండి.
క్లీనింగ్: వంటగది శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఈగలు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, మురికి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ముఖ్యంగా వంటగది క్యాబెనెట్లను క్లీన్ చేయాలి. అలాగే మూలలను, సింక్ ను శుభ్రంగా ఉంచుకోవాలి.