అన్నంతో కొరియన్ల లాంటి అందం.. ముఖానికి ఎలా పెట్టాలో తెలుసా?

First Published | Sep 6, 2024, 11:49 AM IST

అన్నం కేవలం తినడానికి మాత్రమే కాదు.. దీన్ని అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగించొచ్చు తెలుసా? అవును అన్నంతో మీరు కొరియన్ల లాగ అందంగా కనిపిస్తారు. 
 

కొరియన్ల సినిమాల్లో అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొరియన్ సినిమాలు చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది.. అసలు వీళ్లు ఇలా అందంగా ఎలా ఉంటారని. కొరియన్ల చర్మం అద్దంలా మెరిసిపోతుంటుంది.

అందుకే వీళ్ల చర్మాన్ని గ్లాస్ స్కిన్ అంటారు. అంటే వీరి చర్మంలో ప్రతిబింబాలను చూడొచ్చు.  కానీ వీళ్లు ఇందుకోసం పెద్దగా మేకప్ ను కూడా ఉపయోగించరట. కానీ మనం మన చర్మానికి ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటాం. అయినా అలా అందంగా కనిపించం. 

కానీ మనం రోజూ మూడు పూటలా తినే అన్నంతో మాత్రం కొరియన్ల లాంటి అందం మన సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నమ్మాలనిపించడం లేదు కదా.. కానీ నిజం. అన్నం మన చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అసలు అన్నం మన ముఖానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి

అన్నంలో  మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్-బి చర్మ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. మరమ్మత్తుకు సహాయపడుతుంది. అన్నంలో ఉండే విటమిన్-ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. 

హైడ్రేట్

రైస్ లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో సరైన హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అన్నం మన చర్మాన్ని హైడ్రేట్ గా, మరింత మృదువుగా చేస్తుంది. అలాగే డ్రై స్కిన్ సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


మృదువైన ఎక్స్ఫోలియేషన్ 

అన్నాన్ని గ్రైండ్ చేసి మీరు స్మూత్ నేచురల్ ఎక్స్ఫోలియంట్ గా  కూడా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇది మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. పై చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇదెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఆయిల్ నియంత్రణ

చర్మంలోని అదనపు నూనెను గ్రహించడానికి అన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మీరు బియ్యం నీటిని టోనర్ గా ఉపయోగించినా లేదా ఫేస్ మాస్క్ లో బియ్యం పిండిని కలిపినా జిడ్డు నియంత్రణలో ఉంటుంది. అలాగే మొటిమలు కూడా తొందరగా తగ్గిపోతాయి. 
 

కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది

అన్నంలో ఉండే పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

ఇలా వండిన అన్నాన్ని ముఖానికి అప్లై చేయాలి

అపకపం మాస్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

1/2 కప్పు వండిన అన్నం, 1-2 టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగు,1 టీస్పూన్ తేనె,3-4 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్

మాస్క్ ను ఎలా తయారు చేయాలి?

ముందుగా బియ్యాన్ని బాగా కడిగి.. తర్వాత ఆ నీటిని తీసేసి బియ్యాన్ని  2-3 రోజులు నిల్వ ఉంచండి.  ఆ తర్వాత దీన్ని నార్మల్ గా వండండి. అంటే దీనిలో ఉప్పు గానీ, మసాలాలు గానీ వేయకూడదు.

ఈ అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వండి. అయితే ఈ అన్నం మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండాలి. అన్నం చల్లారిన తర్వాత ఫోర్క్ లేదా స్పూన్ తో మెత్తగా రుబ్బి ముతక పేస్ట్ లా తయారుచేయండి. 

ఈ అన్నంలో 1-2 టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగును వేసి కలపండి. ఇది మాస్క్ కు మాయిశ్చరైజింగ్ లక్షణాలను అందిస్తుంది. తర్వాత దీనిలో 1 టీస్పూన్ తేనె వేసి కలపండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మంచి వాసన రావడానికి మీరు దీనిలో కొన్ని రకాల నూనెలను కూడా కలపొచ్చు. అంతే మాస్క్ రెడీ. 
 

అయితే ఈ మాస్క్ ను అప్లై చేసే ముందు మీ ముఖానికి మేకప్ లేదా వేరే ఏం ఉన్నా క్లెన్సర్ తో క్లీన్ చేయండి. శుభ్రమైన చేతులు లేదా బ్రష్ తో అన్నం మాస్క్ ను ముఖానికి సమానంగా పెట్టండి.

అయితే దీన్ని కళ్లకు కొంచెం దూరమే పెట్టాలి. మీరు దీన్ని మెడకు కూడా పెట్టొచ్చు. మాస్క్ ను సన్నని, సమాన పొరలో అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ముఖాన్ని కడిగేప్పుడు ఎక్స్ఫోలియేట్ చేయడానికి మీ వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి.

తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయండి. ముఖం కడిగిన తర్వాత బియ్యం నీటిని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖం తేమగా ఉండటానికి  మాయిశ్చరైజర్ ను పెట్టండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 

click me!