ఆల్కహాల్ ఉండే ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా.. శెనగపిండిలో అస్సలు కలపకూడదు. కలపినా.. అది ముఖానికి రాయకూడదు. ఎందుకంటే... ఆల్కహాల్ కలిపిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల.. మన చర్మంపై ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి. దాని వల్ల చర్మం పొడిగా మారుతుంది.
మరి.. శెనగపిండిలో ఏం కలిపి ముఖానికి రాసుకోవచ్చు అనే సందేహం మీకు ఉందా.. మనం అందాన్ని పెంచుకోవాలి అంటే... పసుపు, రోజ్ వాటర్, పెరుగు, అలోవెరా జెల్ లాంటివి అయితే... కలిపి రాసుకోవచ్చు. ఇది.. చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.