women health
ఆడవాళ్లు ఇంటా, బయట ఎన్నో పనులు చేస్తారు. మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. దీనివల్లే ఆడవారు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతారు. కానీ దీనివల్లే వీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా కంఫర్టబుల్ గా చేయగలిగే పనులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పనులు ఆడవాళ్లను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందాన్ని కూడా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆడవాళ్లు రోజూ చేయాల్సిన 7 పనులు ఇవి
ఏదేమైనా, ఎన్ని పనులు ఉన్నా కానీ. ఆడవారు ఖచ్చితంగా తమ రోజువారి ఆహారంలో అంజీర, మఖానా,ఖర్జూరాలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మూడు డ్రై ఫ్రూట్స్ పీరియడ్స్, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
అలాగే ఇవి కటి ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఆడవారి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి. అలసట రాకుండా చేస్తాయి.
ఆడవాళ్లు ప్రతిరోజూ కూల్ వాటర్ తో ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. అవును కూల్ వాటర్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
దీంతో మీ చర్మం సహజంగా మెరుస్తుంది. అలాగే ఇది చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు, బ్లాక్ హెడ్స్ ముఖంపై లేకుండా చేస్తుంది. కూల్ వాటర్ కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను, కంటి వాపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
women health
మహిళలు ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఎందుకంటే ఇధి మలం మృదువుగా ఉండటానికి, సులభంగా బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.
women health
ఆడవారు రోజూ తమ ఆహారంలో విత్తనాలను చేర్చుకోవాలి. అంటే గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
వీటిని తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకలను బలంగా చేస్తుంది. హెయిర్ పెరగడానికి సహాయపడుతుంది.
women health
ఉదయాన్నే ఆడవాళ్లు ముఖానికి, మెడను మసాజ్ చేయాలి. దీనివల్ల ముఖం వాపు తగ్గుతుంది. అలాగే ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే ముఖంపై ఉండే ముడతలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
ప్రతిరోజూ ఆడవాళ్లు యోగా, వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. యోగా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఇది మీ చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.