గుమ్మడికాయ గింజలు: జింక్ సమృద్ధిగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ సంశ్లేషణకు దోహదం చేస్తుంది.
కొబ్బరి: చర్మానికి పోషణనిచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.
ఖర్జూరం: అవసరమైన విటమిన్లు , ఖనిజాలను అందించే సహజ స్వీటెనర్.
పొద్దుతిరుగుడు విత్తనాలు: విటమిన్ E తో ప్యాక్ చేసి ఉంటుంది, ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఈ పానీయం చేయడానికి... 1 tsp గుమ్మడి గింజలు, 1 tsp తురిమిన కొబ్బరి, 2 తురిమిన ఖర్జూరాలు , 1 tsp పొద్దుతిరుగుడు విత్తనాలను ఒక కప్పు నీటిలో కలపండి. మంచిగా బ్లెండ్ చేసుకొని తాగేయడమే. రెగ్యులర్ గా తాగుతూ ఉంటే.. ఫలితం మీకు క్లియర్ గా కనపడుతుంది. అందంగా కనిపించడానికి మాత్రమే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.