వారానికి 3 సార్లు తలస్నానం చేసిన తర్వాత కూడా కొంతమందికి నెత్తిమీద బాగా దురద పెడుతుంటుంది. ఈ దురదను ఆపుకోలేరు కూడా. కానీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. నిజానికి ఇలా దురద ఎందుకు పెడుతుంతో తెలుసా? నెత్తిమీద పేలు ఉండటం వల్లే. అవును పేలు ఎక్కువగా ఉన్నప్పుడే విపరీతమైన దురద పెడుతుంది. దీనివల్ల నెత్తిని గోక్కోకుండా ఉండలేరు. పేలు అనేది ఒక రకమైన పరాన్నజీవి. ఇది వ్యక్తి శరీరంలో జన్మిస్తుంది. కేవలం తల వెంట్రుకల్లోనే కాదు శరీరంలో ఎక్కడైతే వెంట్రుకలు బాగా వస్తాయో అక్కడే ఉంటాయి. ఈ పరాన్నజీవులు చర్మానికి అంటుకుని రక్తం తాగి దురద కలిగిస్తాయి. ఇది పరిశుభ్రత లోపం వల్ల జరిగినప్పటికీ.. కొన్నిసార్లు పేళ్లు ఒకరి తల నుంచి మరొకరి తలకు ఎక్కుతాయి. మరి వీటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1. వేప ఆకులను నీటిలో మరిగించి వడకట్టి చల్లారనివ్వండి. ఈ వాటర్ ను స్ప్రే బాటిల్ లో పోయండి. తర్వాత రోజుకు నాలుగైదు సార్లు మీ నెత్తికి స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల వారం రోజుల్లోనే మీ నెత్తిలో ఉన్న పేలన్నీ పారిపోతాయి.
2. కొబ్బరినూనెలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. టి-ట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేను లేదా ఇతర రకాల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
3. తులసి ఆకుల రసాన్ని తీసి వేప ఆకుల రసంతో మిక్స్ చేయండి. దీన్ని మీ జుట్టు మొత్తానికి అప్లై చేయండి. దీనివల్ల కూడా పేలు పోతాయి.
4. కొబ్బరినూనెలో వెల్లుల్లిని వేడి చేసి ఆ తర్వాత నూనెను చల్లార్చి జుట్టుకు అప్లై చేయండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఈ రెమెడీతో వారం రోజుల్లోనే పేళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉప్పు కలిపి రాత్రంతా జుట్టు మూలాలకు పట్టించండి. ఉదయాన్నే తలస్నానం చేస్తే చనిపోయిన పేలు మీకు కనిపిస్తాయి.
6. రోజ్ వాటర్ లో 1 టీస్పూన్ బేకింగ్ సోడాను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఒక గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.
lice
7. సెలెరీని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్ లో నింపండి. తర్వాత దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు ఉపయోగించండి. ఇది మీకు పేనుల నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.
8. పేలను వదిలించుకోవాలనుకుంటే మీరు బాదం నూనెలో నిమ్మరసాన్ని కలిపి కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల పేను సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
9. ఒక కప్పు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్ చేసి.. ఆ నీళ్లతో జుట్టును వాష్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే 10 రోజుల్లోనే పేల నుంచి ఉపశమనం లభిస్తుంది.