బ్రాలు వేసుకునే అలవాటు చాలా మంది ఆడవారికి ఉంటుంది. ఇవి వక్షోజాలకు మద్దతునిస్తాయి. అలాగే మంచి ఆకారాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది ఆడవారు రోజంతా బ్రాలు వేసుకుంటారు. కొంతమంది వీటిని నైట్ టైం తీసేస్తే మరికొంతమంది అలాగే వేసుకుని పడుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్రా లను నైట్ టైం వేసుకోకపోవడమే మంచిది. అయితే కొంతమంది అమ్మాయిలు వరుసగా 2 రోజులు ఒకే బ్రా ను వేసుకుంటారు. అసలు ఇది మంచిదేనా? దీనివల్ల ఏవైనా సమస్యలు వస్తాయా?రోజుకు ఎన్ని బ్రాలు మార్చాలి? బ్రా ఎన్ని రోజులు వాడాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్రా ల్లో పేరుకుపోయిన మురికి
బ్రాలను వేసుకునే అలవాటు చెడ్డదేం కాదు. కానీ వరుసగా రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వేసుకుంటేనే సమస్య. ఎందుకంటే ఇవి మీ చర్మానికి అత్తుక్కుపోతాయి. దీనివల్ల శరీర మురికి, చెమట, బ్యాక్టీరియా అన్నీ బ్రాకు అంటుకుంటాయి. దీంట్లోనే అవి నివాసముంటాయి.
చర్మానికి హానికరం
ఒకే బ్రాను ఒకరోజు కంటే ఎక్కువ రోజులు వేసుకోవడం మీకు అస్సలు మంచిది కాదు. అవునే ఒకేబ్రాను చాలా రోజులు వేసుకోవడం వల్ల బ్రాలో పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా వల్ల మీ చర్మం దెబ్బతింటుంది.
శుభ్రమైన బ్రా
మీ చర్మాన్ని ఆరోగ్యంగా , సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజూ శుభ్రమైన బ్రానే వేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. అలాగే ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. అలాగే రోజంతా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
2-3 రోజులు బ్రా వేసుకుంటే?
ఒకే బ్రాను వరుసగా రెండు మూడు రోజులు వేసుకునే అలవాటు ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఇలా ఒకే బ్రాను చాలా రోజులు వేసుకోవడం వల్ల మీ శరీరానికి హాని కలుగుతుంది. అలాగే ఎండాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం
మీరు ఎక్కువ సేపు బయట ఉన్నప్పుడు బ్రాలో చెమట పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ బ్రాను 2 రోజుల పాటు అలాగే వేసుకుంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
దద్దుర్లు రావొచ్చు
కొన్ని కొన్ని సార్లు వరుసగా మీరు రెండు మూడు రోజులు టైట్ బ్రా ను వేసుకోవడం వల్ల కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య రావొద్దంటే మీరు ఒకే బ్రాను రెండు మూడు రోజులు వేసుకోకూడదు.
చర్మంపై మచ్చలు
రోజంతా ఒకే బ్రా ను వేసుకోవడం వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఇది భుజం నొప్పి, వెన్నునొప్పి సమస్యలకు కూడా దారితీస్తుంది.