ఇలా చేస్తే మహిళల సంపాదన పెరుగుతుంది..!

మహిళలు ఏ రంగంలో ఉన్నా.. తమను తాము తమ కాళ్లపై నిలపడాలంటే ఏం  చేయాలో..? సంపాదన పెంచుకోవడానికి ఏం చేయాలో ఓసారిచూద్దాం...
 

ప్రతి ఒక్కరూ తమ సంపాదన పెంచుకోవాలనే చూస్తారు. చాలా మంది స్త్రీలకు సంపాదన ఎందుకు అని ఫీలౌతూ కూడా ఉంటారు. భర్త ఉద్యోగం చేస్తే సరిపోదా.. భార్య కూడా చేయాలా అని మరికొందరు అంటారు. కానీ.. ఈ ప్రస్తుత కాలంలో  ప్రతి ఒక్కరూ తమను తాము ఆర్థికంగా నిలపెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలపడాలి. మహిళలు ఏ రంగంలో ఉన్నా.. తమను తాము తమ కాళ్లపై నిలపడాలంటే ఏం  చేయాలో..? సంపాదన పెంచుకోవడానికి ఏం చేయాలో ఓసారిచూద్దాం...

మీరు ముందు మీరు సంపాదన పెంచుకోవాలంటే మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోవాలి.మీ చదువుపై ఫోకస్ పెట్టాలి. స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కెరీక్ కి ఉపయోగపడే వాటిని నేర్చుకోవాలి.



సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచే సేవింగ్ చేయడం మొదలుపెట్టాలి. ముందు నుంచే సేవింగ్స్ చేయడం వల్ల.. భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. నిధులు పెరుగుతాయి.

ముందు నుంచే ఫైనాన్షియల్ గోల్స్ ఏర్పరుచుకోవాలి. మీ సంపాదనకు అనుగుణంగా బడ్జెట్ ఏర్పాటు  చేసుకోవాలి. దాంట్లో ఖర్చులు ఎంత..? దేనికి ఎంత ఖర్చు  చేస్తున్నారు? ఎంత చేయాలి అనేవి రాసుకొని, దానికి తగినట్లుగా చూసుకోవాలి. 
 

ఇక తెలివిగా పెట్టుబడులు పెట్టాలి.స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో తెలివిగా పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా సంపాదన పెంచుకోవచ్చు.

రిటైర్మెంట్ ఎకౌంట్స్ గురించి తెలుసుకొని దానిలో మొదటి నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఇది లాంగ్ టర్మ్ లో సహాయపడుతుంది.
 

మీరు చేస్తున్న ఒక్క ఉద్యోగం కాకుండా,.. ఇతర ఇన్ కమ్ వచ్చేవి కూడా చూసుకోవాలి. అంటే ఫ్రీలాన్సింగ్, రెంటల్ ప్రాపర్టీస్ లాంటివి చూసుకోవాలి.
 


ఎంత అసవరం అయినా అప్పు చేయకుండా ఉండాలి, ఒకవేళ చేసినా.. ఎక్కువ వడ్డీ వసూలు చేసే అప్పుల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
 


ఇక మీ సంపాదన ఎంత ఉన్నా.. ఆరోగ్య భీమాలు కచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో కచ్చితంగా చెప్పలేం కాబట్టి.. కచ్చితంగా హెల్త్ పాలసీలకు డబ్బులు కడుతూ ఉండటం చాలా మంచిది.

Latest Videos

click me!