మీకు బ్యూటీ విటమిన్ తెలుసా?ఇది రాస్తే అందం పెరగాల్సిందే..!

First Published | Aug 8, 2024, 3:59 PM IST

ఎక్కువ మంది అందంగా కనపడేందుకు ఖరీదు ఎక్కువగా ఉండే క్రీములు వాడుతూ ఉంటారు. కానీ... చాలా తక్కువ ఖరీదుతోనే మనకు ఈ బ్యూటీ విటమిన్ లభిస్తుంది.

ఏ వయసులో ఉన్నా సరే.. తాము అందంగా కనిపించాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం ఎవరికి తెలిసినవి వాళ్లు చేస్తారు.  ఎక్కువ మంది టీవీల్లో వచ్చే యాడ్స్ ని నమ్మేసి... వాటిని వాడేస్తూ ఉంటారు. అవి కొందరికి వర్కౌట్ అవుతాయి.. కొందరికి అసలు.. పనిచేయకపోగా.. ఇతర సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. మీకు అలాంటి ఇబ్బంది రాకుండా.. సహజంగా అందంగా మెరిసిపోవాలంటే... కచ్చితంగా ఈ  బ్యూటీ విటమిన్ ని వాడాల్సిందే.

ఎక్కువ మంది అందంగా కనపడేందుకు ఖరీదు ఎక్కువగా ఉండే క్రీములు వాడుతూ ఉంటారు. కానీ... చాలా తక్కువ ఖరీదుతోనే మనకు ఈ బ్యూటీ విటమిన్ లభిస్తుంది. మరి ఆ బ్యూటీ విటమిన్ ఏంటో.. దానిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

vitamin E

విటమిన్ ఏ, విటమిన్ ఈ లు.. మన చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి. ముఖ్యంగా విటమిన్ ఈ ని బ్యూటీ విటమిన్ అని చెప్పొచ్చు. దీనినే బ్యూటీ విటమిన్ అని ఎందుకు పిలుస్తారంటే... దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి..  మన చర్మంలోసి కణాలు దెబ్బతినకుండా.. మంచిగా ఉండేలా సహాయం చేస్తాయి.


విటమిన్ ఈ మన చర్మాన్ని మంచిగా తేమగా ఉంచుతుంది.  దాని వల్ల చర్మం సాఫ్ట్ గా ఉండటంతో పాటు.. మెరుస్తూ కనపడుతుంది.  అంతేకాకుండా.. విటమిన్ ఈ మన చర్మంలో డెడ్ సెల్స్ ని రిపేర్ చేసి.. కొత్త సెల్స్ తయారయ్యేలా ప్రోత్సహిస్తుంది. మన ముఖం పై వచ్చే ఎన్నో రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి.
 

మీరు విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తిన్నా కూడా అందంగా కనిపిస్తారు. లేదు.. మాకు రిజల్ట్ చాలా త్వరగా కావాలంటే.. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మార్కెట్లో దొరుకుతాయి. ధర కూడా చాలా తక్కువ. వాటిని కనుక మీరు చక్కగా ముఖానికి రాస్తే సరిపోతుంది.  మీ అందాన్ని పెంచడంలో చాలా బాగా సహాయడతాయి.
 

Latest Videos

click me!