చైతూతో ఎంగేజ్మెంట్.. శోభితా చీర ధర ఎంతో తెలుసా?

First Published | Aug 8, 2024, 3:15 PM IST

ఈ ఎంగేజ్మెంట్ ఫోటోల్లో శోభితా లుక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండటం విశేషం. ఆమె సింపుల్ గా తయారైన విధానం, ఆమె చీర, ఆ కలర్, ఆమె రింగ్ ధర ఇలా అన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.

శోభితా ధూళిపాళ్లకు పరిచయం అవసరం లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. శోభితా తన అందం, అభినయంతోనే కాదు తన స్టైలిష్ ఫ్యాషన్ సెలక్షన్ తో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. కాగా.. తాజాగా.. ఆమె.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకన్నారు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. వీరిద్దరిలో  ఎవరూ కనీసం కన్ఫామ్ చేయలేదు. దీంతో.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్  జరిగింది అంటూ నాగార్జున ఫోటోలు షేర్ చేశారు. 

ఈ ఫోటోలు చూసి కొందరు షాకవ్వగా.. కొందరు..విషెస్ చెబుతున్నారు. అయితే.. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోల్లో శోభితా లుక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండటం విశేషం. ఆమె సింపుల్ గా తయారైన విధానం, ఆమె చీర, ఆ కలర్, ఆమె రింగ్ ధర ఇలా అన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.


కాగా... శోభితా తన ఎంగేజ్మెంట్ కి పీచ్ కలర్ కాంజివరం పట్టుచీర ధరించింది. ఇక చెక్స్ మోడల్ మ్యాచింగ్ బ్లౌజ్ ధరించారు. ఇక సింపుల్ గా...మెడలో మూడు లేయర్ల గోల్డ్ చైన్ ధరించారు.  

చెవులకు బుట్టలు ధరించారు. తలలో కనకాంబరం పూలు మరింత అందాన్ని తెచ్చాయి. ఈ కాంజివరం చీర ధర రూ.రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది.

ఇక.. శోభిత తన మేకప్ లుక్ కూడా చాలా సింపుల్ గా ఉండేలా చూసుకుంది. నేచురల్ బ్లష్, కాజల్.. పెదాలకు న్యూడ్ కలర్ గ్లాసీ లిప్ స్టిక్ ఎంచుకుంది. మినమల్  మేకప్ లో ఆమె చాలా అందంగా కనపడుతోంది. ఈ ఫోటోల్లో ఆమె.. చేతికి ఎంగేజ్మెంట్ రంగు  కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. అది డైమండ్ రింగ్ అని.. దాని ఖరీదు రూ.5లక్షలు అని సమాచారం.

ఇదిలా ఉండగా.. గతంలో నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం వారు విడాకులు  తీసుకొని విడిపోగా.. ఇప్పుడు నాగ చైతన్య.. శోభితాతో కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. ఈ వార్త అక్కినేని ఫ్యాన్స్ ని చాలా ఖుషీ చేయడం గమనార్హం. 

Latest Videos

click me!