బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి పరిచయం అవసరం లేదు. నటిగా మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ గాను జాన్వీకి మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య దేవర మూవీ లాంచింగ్ సమయంలో జాన్వీ ఓ మోడల్ చీర ధరించగా.. అది వెంటనే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరూ ఆ మోడల్ చీరలు కొన్నవారే. అలా కొత్త కొత్త ట్రెండ్స్ ని పరిచయం చేయడంలో జాన్వీ ముందుంటుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు ఫ్యాషనబుల్ గా కనిపించాలంటే.. జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అయితే సరిపోతుంది.