నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 31, 2024, 2:30 PM IST

ఆడవాళ్లకు మెహందీ అన్నా, నెయిల్ పాలిష్ అన్నా ఎక్కడ లేని ఇష్టం. ఒకప్పుడు ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు మాత్రమే వీటిని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లకున్నా గోర్లకు ఎప్పుడూ నెయిల్ పాలిష్ ఉండేలా చూసుకుంటున్నారు. కానీ దీన్ని పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా? 

అందంగా, స్టైలిష్ గా కనిపించడానికి ఆడవాళ్లు ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా వేసుకున్న డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా నెయిల్ పాలిష్ ను పెడుతున్నారు. కొంతమంది అయితే ఎప్పుడూ గోర్లకు ఏదో ఒక కలర్ నెయిల్ పాలిష్ ఉండేలా చూసుకుంటుంటారు.

ఇది గోర్లను అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ నెయిల్ పాలిష్ ను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? అసలు నెయిల్ పాలిష్ వల్ల మనకు వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


మంచిది కాదు

నెయిల్ పాలిష్ వల్ల మీ గోర్లు అందంగా కనిపిస్తాయనేది నిజమే. కానీ దీన్ని తరచుగా అప్లై చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇది మీ గోర్లను, మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

నెయిల్ పాలిష్ లో కెమికల్స్

అవును ప్రతి ఒక్క కలర్ నెయిల్ పాలిష్ లో ఎన్నో రకరకాల రసాయనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మనకు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఇకపోతే జెల్ నెయిల్ పాలిష్ లో మెథాక్రిలేట్స్, యాక్రిలేట్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 


Image: Getty

ఊపిరితిత్తులకు హానికరం 

నెయిల్ పాలిష్ ను గోర్లకు ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. దీన్ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల మీ శ్వాసకోశ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది ఊపిరితిత్తుల్లో వాపును కలిగిస్తుంది. అలాగే శ్వాస సమస్యలు వచ్చేలా చేస్తుంది. 

అలెర్జీ సమస్యలు 

నెయిల్ పాలిష్ ను ఎప్పుడూ పెట్టుకోవడం వల్ల అలెర్జీ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా దీనివల్ల స్కిన్ అలర్జీ వస్తుంది. అలాగే చర్మం ఎర్రగా అవుతుంది. 
 

Image: Getty

గోర్లు పసుపు రంగులోకి మారడం

ఎప్పుడూ గోర్లకు నెయిల్ పాలిష్ ను పెట్టుకునేవారి గోర్లు ఇతరుల గోర్లకు భిన్నంగా ఉంటాయి. అంటే నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్స్ వీరి గోళ్లపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల గోర్లు వాటి సహజ రంగును కోల్పోయి పసుపు రంగులోకి మారిపోతాయి.

పొడి గోర్లు 

నెయిల్ పాలిష్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ గోర్లపై చెడు ప్రభావం పడుతుంది. అంటే దీనివల్ల గోర్లు పసుపు రంగులోకి మారడమే కాకుండా.. గోర్లు పొడిబారుతాయి. అలాగే వాటి సహజ మెరుపును కూడా కోల్పోతాయి. 

Image: Getty

మెదడుపై చెడు ప్రభావం

నెయిల్ పాలిష్ మీ మెదడుపై కూడా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. దీనిలో టోల్యూన్ అనే ద్రావకం ఉంటుంది. ఇది మన మెదడు, నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల భరించలేని తలనొప్పి, వికారం, మూర్చ వంటి సమస్యలు వస్తాయి. 

Latest Videos

click me!