ముఖం అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. అందంగా కనపడాలంటే.. మేకప్ కచ్చితంగా ఉండాల్సిందే అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో అందంగా మెరిసిపోవచ్చు. ముఖ్యంగా బియ్యంతో నే అందాన్ని పెంచుకోవచ్చు. మీ ఇంట్లో బియ్యం, ఎర్ర కంది పప్పు ( మసూర్ దాల్) ఉంటే ఆ రెండూ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖంలో గ్లో పెరుగుతుంది. మరి, ఆ ఫేస్ ఫ్యాక్ ఎలా చేయాలో చూద్దాం..
బియ్యం, మసూర్ దాల్ బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్
బియ్యం, మసూర్ దాల్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ ప్యాక్
నాలుగు చెంచాల నానబెట్టిన బియ్యం, మసూర్ దాల్ ని మెత్తగా పేస్ట్ చేయాలి. పెరుగు కలిపి మిశ్రమం చేయాలి. కళ్ళకు దూరంగా ఉంచి, ముఖం, మెడపై ప్యాక్ రాసి, వృత్తాకారంలో రుద్దాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
బియ్యం, మసూర్ దాల్ బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్
బియ్యం పిండి, మసూర్ దాల్ పొడిని కలపాలి. తేనె, తగినంత పాలు కలిపి గట్టి పేస్ట్ చేయాలి. ముఖం, మెడపై 20 నిమిషాలు ఉంచి కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
యాంటీ-టాన్ ఫేస్ ప్యాక్
బియ్యం, మసూర్ దాల్ యాంటీ-టాన్ ఫేస్ ప్యాక్
రెండు చెంచాల బియ్యం పిండి, మసూర్ దాల్ పొడిని కలపాలి. నిమ్మరసం, కలబంద గుజ్జు కలిపి పేస్ట్ చేయాలి. ముఖం, మెడపై రాసి 15-20 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి.
మొటిమలకు ఫేస్ ప్యాక్
మొటిమలకు బియ్యం, మసూర్ దాల్ ఫేస్ ప్యాక్
సమానంగా బియ్యం పిండి, మసూర్ దాల్ పొడి, ఒక చెంచా పసుపు కలపాలి. గులాబీ నీళ్ళు కలిపి పేస్ట్ చేసి, ముఖం, మెడపై 20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి.
యాంటీ-ఏజింగ్ ఫేస్ ప్యాక్
యాంటీ-ఏజింగ్ ఫేస్ ప్యాక్
బియ్యం పిండి, మసూర్ దాల్ పొడి కలపాలి. అరటిపండు గుజ్జు, ఆలివ్ నూనె కలిపి పేస్ట్ చేయాలి. ముఖం, మెడపై రాసుకుంటే ముడతలు తగ్గుతాయి.
హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్
హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్
రెండు చెంచాల బియ్యం పిండి, మసూర్ దాల్ పొడి కలపాలి. దోసకాయ రసం, తేనె కలిపి పేస్ట్ చేయాలి. ముఖం, మెడపై రాసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.