ఆడవాళ్లు పొద్దున్న తినకపోతే జరిగేది ఇదే..!

First Published Feb 16, 2024, 3:11 PM IST

ఏది ఏమైనా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలంటారు డాక్టర్లు. ఎందుకంటే ఇదే మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అయితే పనిలో పడి చాలా మంది ఆడవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ దీనివల్ల ఏం అవుతుందో తెలుసా? 
 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని బలంగా ఉంచుతాయి. వీటిలో ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మరువకూడదు.  ఎందుకంటే రాత్రి ఎప్పుడో 8 గంటలకు తిని మళ్లీ ఉదయమే తింటారు. ఇదే బ్రేక్ ఫాస్ట్ కున్న ప్రత్యేకత. ఉదయాన్నే మనం తినే ఆహారం మన శరీరంలో త్వరగా కలిసిపోతుంది. ఇది మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో హెల్తీ ఫుడ్స్ ను తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా లేదంటారు డాక్టర్లు.
 

అయితే బ్రేక్ ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను తినరు. పనిలో బిజీగా ఉండటం, సమయం లేకపోవడం, ఉదయం పూట ఆకలి వేయకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

skipping breakfast

కొంతమంది అడపాదడపా ఉపవాసంలో భాగంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను కూడా స్కిప్ చేస్తారు. అడపాదడపా ఉపవాసం జీర్ణక్రియ, కడుపు ఆరోగ్యానికి మంచిది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇది అందరి ఆరోగ్యానికి సమానంగా ఉపయోగపడదని డాక్టర్లు చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళలు బ్రేక్ ఫాస్ట్ మానేయడం మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రెగ్యులర్ గా ఉదయం తినకపోవడం వల్ల మహిళల్లో హార్మోన్ల సమస్యలు, షుగర్, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉదయం బ్రేక్  ఫాస్ట్ ను తినకపోవడం వల్ల కూడా మహిళలు రోజంతా అస్వస్థతకు, బద్ధకానికి లోనవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మహిళల్లో నెలసరి సమస్యలు పెరగడానికి ఒక కారణం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినలేకపోవడమేనంటున్నారు.

Image: Getty

ఆడవాళ్లు ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుడ్లు, అవొకాడోలు వంటి వంటకాలు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి ప్రోటీన్ కు మంచి వనరులు. ఇది మీకు అతిగా ఆకలి కాకుండా చేస్తుంది. ఆకలి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శక్తిని కూడా అందిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. 
 

ఉదయం మాంసకృత్తులను మాత్రమే కాదు, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

click me!