సమ్మర్ కి సూటయ్యే బెస్ట్ పార్టీవేర్ చీరలు ఇవే..!

Published : Feb 15, 2024, 01:35 PM IST

ఈ వేసవిలో పార్టీలు, ఫంక్షలకు సూట్ అయ్యేలా.. ఈ సీజన్ కి మంచి కంఫర్ట్ ఇచ్చే కొన్ని చీరలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..

PREV
16
సమ్మర్ కి సూటయ్యే బెస్ట్ పార్టీవేర్ చీరలు ఇవే..!

ఇలా చూశామో లేదో అప్పుడే ఎండాకాలం వచ్చేసింది.  బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూడా ఏసీలు వేసుకోనిది నిద్రపట్టదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ కాలంలో అన్ని రకాల దుస్తులు వేసుకోలేం. ఇటు చేస్తేనేమో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వస్తున్నాయి. ఈ మండే ఎండల్లో పట్టుచీరలు కట్టుకోవాలంటే... వామ్మో తలుచుకుంటేనే భయం వేసేస్తోంది. కానీ... మరి పెళ్లిళ్లు, ఫంక్షన్ లకు మామూలు చీరలు కట్టుకోలేం. అలాంటి సమస్యతో మీరు కూడా ఇబ్బందిపడుతున్నారా అయితే...  ఈ వేసవిలో పార్టీలు, ఫంక్షలకు సూట్ అయ్యేలా.. ఈ సీజన్ కి మంచి కంఫర్ట్ ఇచ్చే కొన్ని చీరలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..
 

26

1.ఫ్లోరల్ కాటన్ శారీ..
 మండే ఎండల్లో కాటన్ డ్రెస్ కానీ, శారీ కానీ వేసుకుంటే వచ్చే హాయి మామూలుగా ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడే అంటే వేసుకోవచ్చు ,కానీ.. ఫంక్షన్ లకు కాటన్ చీర కట్టుకొని వెళితే ఎంత చీప్ గా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఈ కాటన్ చీరలు కూడా ఇప్పుడు మారిపోయాయి. ప్రస్తుతం ఫ్లోరల్ కాటన్ చీరలు మార్కెట్లోకి వస్తున్నాయి. అవి చూడటానికి క్లాసీ లుక్ ఇవ్వడంతోపాటు.. ఒంటిపై వేసుకుంటే  హాయి అనుభూతిని కలిగిస్తాయి. మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే కలర్ ఎంచుకుంటే చాలు. కాటన్ చీరలు శ్వాసక్రియకు సౌకర్యవంతంగా ఉంటాయి, ఇవి వేడి , తేమతో కూడిన వాతావరణానికి అనువైనవిగా ఉంటాయి. బ్రంచ్‌లు, పగటిపూట ఈవెంట్‌లు లేదా సాధారణ విహారయాత్రలకు అనువైన పగటిపూట చిక్ లుక్ కోసం కాంట్రాస్టింగ్ బ్లౌజ్ , మినిమల్ జ్యువెలరీతో ఈ చీరను జత చేయండి. గెస్ట్ లుక్ కి అదిరిపోతుంది.

36

2.మనిమల్ ఎంబ్రాయిడరీతో లెనిన్ చీర..

ఇక వేసవి కాలంలో హాయి ఫీలింగ్ కలిగించడంలో లెనిన్ చీరలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. మీరు పార్టీవేర్ కి ఈ లెనిన్ శారీని ఎంచుకోవాలి అంటే.. దానిలో చిన్న మార్పులు చేసుకోవాలి. ఆధునికతను వెదజల్లేలా ఎంచుకోవాలి. మినిమల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెనిన్ చీరను ఎంచుకోవాలి. సున్నితమైన థ్రెడ్ వర్క్ లేదా బార్డర్ లేదా పల్లు వెంట మిర్రర్ వర్క్ వంటి కనిష్ట ఎంబ్రాయిడరీ లేదా అలంకారాలు కలిగిన లెనిన్ చీరల కోసం చూడండి.మంచిగా మీకు సూటయ్యే కలర్స్ ఎంచుకొని, దానికి తగిన బ్లౌజ్ కుట్టంచుకుంటే లుక్ అదిరిపోతుంది.

46


3.జ్యామెట్రిక్ ప్రింట్స్ తో కూడిన సిల్క్-కాటన్ బ్లెండ్ చీర


సిల్క్-కాటన్ బ్లెండ్ చీరలు లగ్జరీ లుక్ ని ఇస్తాయి. అంతేకాదు.. ఈ చీరలు కట్టుకోవడానికి చాలా  సౌలభ్యంగా  ఉంటాయి, ఇవి వేసవి వివాహాలు, పార్టీలు లేదా సాయంత్రం ఈవెంట్‌లకు అద్భుతమైన ఎంపికగా ఉంటాయి. సమకాలీన ట్విస్ట్ కోసం కోబాల్ట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్ లేదా పగడపు ఎరుపు వంటి బోల్డ్ , వైబ్రెంట్ రంగులలో రేఖాగణిత ప్రింట్లు లేదా మోటిఫ్‌లను కలిగి ఉండే చీరలను ఎంచుకోండి. లుక్ అదిరిపోతుంది. కంఫర్ట్ కి కంఫర్ట్ కూడా లభిస్తుంది.

56


4.సీక్విన్ అలంకారాలతో షిఫాన్ చీర

షిఫాన్ చీరలు అనాగరికమైన అందం , అప్రయత్నంగా డ్రేపింగ్‌కు పర్యాయపదంగా ఉంటాయి, వీటిని వేసవి సందర్భాలలో ప్రముఖ ఎంపికగా మారుస్తుంది. గ్లామర్ , ఆకర్షణ కోసం సున్నితమైన సీక్విన్ డిజైన్ లేదంటే.. మెరిసే అంచులతో అలంకరించబడిన షిఫాన్ చీరలను ఎంచుకోండి. సాయంత్రం పార్టీలు లేదా కాక్‌టెయిల్ ఈవెంట్‌లకు అనువుగా ఉంటాయి. అదిరిపోయే లుక్ ఇస్తాయి.

66


5.బ్లాక్ ప్రింట్‌లతో కూడిన చేనేత పట్టు చీర


సాంప్రదాయ బ్లాక్ ప్రింట్లు లేదా చేతితో చిత్రించిన మోటిఫ్‌లతో కూడిన చేనేత పట్టు చీరలు మీ వేసవి వార్డ్‌రోబ్‌కు వారసత్వం, హస్తకళను జోడించడానికి సరైనవి. ఈ పట్టుచీర లుక్ ని గొప్పగా అందించడమే కాకుండా.. వేసవి కాలంలో చాలా మంచి కంఫర్ట్ ని అందిస్తాయి. మీరు వీటిని ఏకంగా పెళ్లిళ్లు, ఫంక్షన్ లకు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా కట్టుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories