ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published May 8, 2024, 9:54 AM IST

ఎండాకాలంలో దోమల బెడదా విపరీతంగా ఉంటుంది. రాత్రిళ్లు వీటివల్ల సరిగ్గా నిద్రకూడా రాదు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చు. ఎలాగంటే?

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంటి నిండా దోమలు ఉంటాయి. వీటివల్ల రాత్రిళ్లు నిద్రపోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు  వస్తాయి. అందుకే మీ ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల దోమలు లేకుండా చూసుకోవాలి. మరి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


కర్పూరం 

ప్రతి ఒక్క ఇంట్లో కర్పూరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ కర్పూరంతో కూడా దోమలను చాలా సులువుగా తరిమికొట్టొచ్చు. కర్పూరంలో దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడే ఎన్నో రసాయన గుణాలు ఉంటాయి. దోమలను తరిమికొట్టడానికి కర్పూరం కాల్చే ముందు గది తలుపులన్నింటినీ మూసేయండి. ఆ తర్వాత గదిలో కర్పూరం పొగ వేయండి. కర్పూరం కాల్చిన 30 నిమిషాల తర్వాత దోమలన్నీ ఇంట్లో నుంచి మాయమవుతాయి. ఇది కాకుండా కర్పూరం మాత్రలను ఒక గిన్నె నీటిలో కూడా ఉంచొచ్చు. దాని ఘాటైన వాసనకు దోమలన్నీ పారిపోతాయి. 
 

camphor

నిమ్మ, లవంగాలు

లవంగాలు, నిమ్మకాయల రెసిపీ కూడా దోమలను ఇంటి నుంచి తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా లవంగాల పొడిని తయారు చేయండి. ఒక టీస్పూన్  లవంగం పొడిలో నిమ్మరసం కలిపి ద్రావణాన్ని తయారుచేయండి. దీన్ని ఇంటి కిటికీలు, తలుపులపై స్ప్రే చేయండి. దోమలకు దాని ఘాటైన వాసన అస్సలు నచ్చదు. దీంతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దోమ బయటకు వెళ్లిపోతుంది. 

దోమలను తరిమికొట్టే మొక్కలు

దోమలను తరిమికొట్టడానికి కొన్ని రకాల మొక్కలు కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు ఇంటి దగ్గర కొన్ని మొక్కలను నాటొచ్చు. వేప చెట్టు, తులసి మొక్క, పుదీనా మొక్క, లావెండర్ మొక్క వంటి మొక్కలు దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మీరు ఈ మొక్కలను ఇంటి లోపల లేదా ఆరుబయట నాటొచ్చు.
 

దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు 

దోమలు ఎక్కువగా నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. కాబట్టి మీ ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూడండి. బకెట్లు, టైర్లు, కుండీలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు చూస్తూ వాటిని శుభ్రం చేస్తుండండి. 
 

దోమలు రాకూడదంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. 

ఇంట్లోకి దోమలు రాకూడదంటే ఇంటి తలుపులు, కిటికీలను మూసేయాలి. ముఖ్యంగా తలుపులు, కిటికీల చుట్టూ చెట్లు, మొక్కలు ఉంటే.. దీన్ని నివారించడానికి మీరు నెట్ ను కూడా ఉపయోగించొచ్చు.

అలాగే కిటికీల వెలుపల చెట్లు, మొక్కలను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండండి. 

click me!