వేసవిలో టిఫిన్ బాక్సు పెట్టేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే ఫుడ్ పాడవుతుంది

First Published May 7, 2024, 4:39 PM IST

ఆఫీసుకు, ఇతర పనులకు వెళ్లేవారు ఉదయం వెళితే ఏ నైట్ కో వస్తారు. అందుకే వీళ్లు మధ్యాహ్నానికి టిఫిన్ బాక్స్ ను తీసుకెళ్తుంటారు. అయితే ఎండల వల్ల చాలా సార్లు టిఫిన్ బాక్సులోని ఫుడ్ పాడవుతుంటుంది. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టైతే మీ ఫుడ్ పాడవదు. 
 

బయటకు పనులపై వెళ్లి సాయత్రం వచ్చే ప్రతి ఒక్కరూ టిఫిన్ బాక్సులను ఖచ్చితంగా తీసుకెళ్తుంటారు. అయితే ఇతర కాలాలతో పోలిస్తే ఎండాకాలంలోనే ఫుడ్ చాలా తొందరగా పాడవుతుంటుంది. కారణం ఎండలు. ముఖ్యంగా టిఫిన్ బాక్సుల్లోని ఫుడ్ చాలా తొందరగా పాడవుతుంటుంది.దీనివల్ల పస్తులు ఉండాల్సి వస్తుంది. అందుకే టిఫిన్ ప్యాక్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టైతే టిఫిన్ బాక్సులోని ఫుడ్ పాడవదు. ఇందుకోసం ఏం చేయాలంటే?
 

lunch box

ప్లాస్టిక్ బాక్స్ వద్దు 

చాలా మంది ప్లాస్టిక్  బాక్సులనే వాడుతుంటారు. ఎండాకాలంలో మీ టిఫిన్ బాక్స్ పాడవకూడదంటే మాత్రం మీరు ప్లాస్టిక్ కు బదులుగా స్టీల్ టిఫిన్ బాక్స్ నే ఉపయోగించాలి. పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్యంతో పాటుగా ప్రకృతిపై కూడా చెడు ప్రభావం పడుతోంది. మధ్యాహ్న భోజనాన్ని ప్లాస్టిక్ లో ఎక్కువ సేపు పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

స్టెయిన్లెస్ స్టీల్ లో

లంచ్ ను స్టెయిన్ లెస్ స్టీల్ లో పెడితే ఎక్కువ సేపు ఫుడ్ పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ లంచ్ బాక్సులు మంచి నాణ్యత, ఉన్నత ప్రమాణాలతో మెరుగ్గా తయారుచేస్తారు. అందుకే మధ్యాహ్నం లంచ్ ను స్టెయిన్ లెస్ స్టీల్ లో పెట్టండి. 
 

టిఫిన్ బాక్సులు ప్యాక్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను కూడా ఉపయోగించొచ్చు.

ఎయిర్ టైట్ ఇన్సులేటెడ్ టిఫిన్ బాక్సులను కూడా మీరు వాడొచ్చు. దీనివల్ల కూరలు పాడవవు. 

ఇన్సులేటెడ్ బ్యాగులతో లంచ్ బాక్స్ కొంటే అన్ని వస్తువులను ఒకే బాక్సులో ప్యాక్ చేసుకోవచ్చు.

click me!