పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో మహిళలు ఎక్కువగా చీరల్లో మెరవడానికి ఇష్టపడతారు. అయితే.. ఎప్పటికప్పుడు ట్రెండీ చీరలు కట్టుకోవడానికే అందరూ ఇష్టపడతారు. మీరు కూడా.. ఈ ఏడాది ట్రెండింగ్ శారీలో మెరిసిపోవాలి అనుకుంటే... ఆ చీరలు ఏంటో ఓసారి చూద్దాం..
1.ఫ్లోరల్ ఫ్రింట్స్..
చీర మెటీరీయల్ ఏదైనా సరే.. అది ఫ్లోరల్ ఫ్రింట్ అని చెప్పొచ్చు. ఫ్లోరల్ ప్రింట్ వయసు సంబంధం లేకుండా..ఎవరికైనా బాగుంటాయి. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు మరింత బాగుంటాయి. ఫ్లోరల్ ప్రింట్స్ లోనూ.. పెద్ద పెద్ద పూలు ఉన్న చీరలు ఎంచుకోవాలి. ఇవి మోడ్రన్ లుక్ తో పాటు.. ఫ్రెష్ ఫీలింగ్ కలగిస్తాయి..
2.మెటాలిక్ ఎస్టాబ్లిష్మెంట్స్..
ఈ ఏడాది ట్రెండ్ సృష్టిస్తున్న చీరల్లో ఈ మెటాలిక్ చీరలు కూడా ఉంటాయి. ఈ చీరలు మొత్తం సిల్వర్, గోల్డ్ ప్రింట్స్ తో ఉంటాయి. గోల్డ్, సిల్వర్ ప్రింట్, ఫాయిల్స్ సీక్వెన్స్, థ్రెడ్ వర్క్ తో చీరలు చాలా అందంగా ఉంటాయి. చాలా క్లాసీ లుక్ ఈ చీరలు మీకు అందిస్తాయి.
3.బ్రాడ్ స్టేట్మెంట్ బోర్డర్స్..
ఇప్పటి వరకు చాలా రకాల బోర్డర్ ఉన్న చీరలు మీరు కట్టుకొనే ఉంటారు. అయితే.. ఈ ఏడాది ట్రెండ్ అవుతున్న చీరల్లో ఇవి బ్రాడ్ స్టేట్మెంట్ బోర్డర్స్. ఆ బోర్డర్ పై జామెట్రిక్ ప్రింట్స్ కూడా ఉంటున్నాయి. కానీ.. విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
4.నెట్-లేస్ సారీలు..
ఈ ఏడాది ట్రెండ్ అవుతున్న చీరల్లో నెట్ లేస్ చీరలు కూడా ముందు వరసలో ఉంటాయి. వీటిని ఈ మధ్య ఎక్కువగా సెలబ్రెటీలు కడుతూ ఉంటారు. ఈ చీరలకు మ్యాచ్ అయ్యేలా మోడ్రన్ బ్లౌజ్ ఎంచుకుంటే లుక్ అదురుతుంది. ఎలిగెంట్ లుక్ రావడం ఖాయం.
5.బోల్డ్ కలర్స్..
మెటీరియల్ ఏదైనా, డిజైన్ ఏదైనా సరే.. బోల్డ్ కలర్స్ ఎంచుకుంటే లుక్ అదిరిపోతుంది. బోల్డ్ కలర్స్ వేసుకుంటే.. అందరిలోనూ మీరు హైలెట్ గా నిలుస్తారు. ఎమ్రాల్డ్ గ్రీన్, వైన్ రెడ్, రాయల్ బ్లూ, డీప్ పర్పుల్ లాంటి బోల్డ్ కలర్ చీరలు సూపర్ గా ఉంటాయి. మీ స్కిన్ కి సెట్ అయ్యేవి ఎంచుకోవడం ఉత్తమం.
6.మిక్స్ అండ్ మ్యాచ్..
మిక్స్ అండ్ మ్యాచ్ మోడల్స్ కొత్తేమీ కాదు. అయితే.. ఈ ఏాడది కూడా.. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ ట్రెండీగా మారుతున్నాయి. కాబట్టి.. మీకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. వాటిలోనూ డిఫరెంట్ కాంబినేషన్ ని మీరు ప్రయత్నించవచ్చు. సిల్క్ ఆర్గాంజా లుక్ కాంబినేషన్ బాగుంటుంది. పేస్టల్ షేడ్ చీరకు.. కాంట్రాస్ట్ బ్లౌజ్ లను కూడా ఎంచుకోవచ్చు. లుక్ చాలా బాగుంటాయి.