అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో క్రీములు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ, చర్మ సంరక్షణకు ఫేషియల్ ఒక్కటే సరిపోదు. లోపల నుండి పోషణ కావాలి. అప్పుడే చర్మం అందంగా ఉంటుంది. మంచి చర్మాన్ని పొందాలంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడకూడదు. తాజా పండ్లు, కూరగాయలు చాలా తినండి.