పచ్చి పాలను ఇలా పెడితే.. డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయి

First Published | Nov 21, 2024, 11:03 AM IST

ఆడవాళ్లకే కాదు చాలా మంది మగవాళ్లకు కూడా డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కానీ వీటివల్ల ముఖం అందంగా కనిపించదు. అందుకే వీటిని తగ్గించుకోవడానికి ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే  పాలతో డార్క్ సర్కిల్స్ ను మొత్తమే లేకుండా చేయొచ్చు. అదెలాగంటే?

డార్క్ సర్కిల్స్ ఒక సాధారణ సమస్య. కానీ దీనివల్ల ముఖంలో అందం తగ్గుతుంది. ఏదో జబ్బున్న వారిలా కనిపిస్తారు. నిజానికి డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఇవి అందాన్ని పాడు చేస్తాయి. అందుకే ఆడవాళ్లు వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 

raw milk

నిపుణుల ప్రకారం.. డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి పాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పాలను ఎన్నో ఏండ్లుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు. పాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పాలలో పుష్కలంగా ఉండే లాక్టిక్ ఆమ్లం మన చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. 

అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. దీంతో కొత్త చర్మం పునరుత్పత్తి అవుతుంది. దీనివల్ల మీరు అందంగా, తాజాగా కనిపిస్తారు. పచ్చి పాలు మన కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది స్కిన్ డ్రైనెస్ ను, వాపును తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. పాలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 


 పాలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇది స్కిన్ మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.  పాలు కళ్ల కింద వాపును కూడా తొందరగా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది స్కిన్ టోన్ ను కూడా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఈ పాలను బాదం నూనె లేదా తేనెతో కలిపి పెట్టినప్పుడు ఇది మరిన్ని ప్రయోజనాలను ఇస్తుంది. దీని వాడకం వల్ల మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. 
 

పాలు మంచి పోషక, ఓదార్పు లక్షణాలున్న పదార్థం. ఇది మన చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచుతుంది. మరి డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి పాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పాలు, కాటన్ ప్యాడ్ పద్ధతి

ముందుగా పచ్చి పాలను తీసుకుని దాంట్లో ఒక కాటన్ ప్యాడ్ ను వేసి నానబెట్టండి. కొవ్వున్న పాలను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఆ తర్వాత ఈ కాటన్ ప్యాడ్ ను తీసుకుని కళ్లపై పెట్టండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయండి. కొద్ది సేపటి తర్వాత కళ్లచుట్టూ సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. 
 

dark circles

పాలు, పసుపు పేస్ట్

ఇందకోసం ఒక టీ స్పూన్ పచ్చి పాలను తీసుకుని అందులో చిటికెడు పసుపును వేసి పేస్ట్ చేయండి. దీన్ని కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయండి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి. 

పాలు, తేనె మాస్క్

తేనెను, పాలను సమానంగా తీసుకుని బాగా కలపండి. దీన్ని కళ్ల చుట్టూ అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఉండే మాయిశ్చరైజింగ్, హీలింగ్ లక్షణాలు డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి. అలాగే పాలు  మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. 

పాలు, బాదం నూనె

పాలు, బాదం నూనె కూడా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం టేబుల్ స్పూన్ పాలలో కొన్ని చుక్కల బాదం నూనెను వేసి కలపండి. రాత్రిపడుకునే ముందు దీన్ని కళ్ల చుడ్డూ పెట్టి కాసేపు మసాజ్ చేయండి. బాదం నూనెలో  ఉండే విటమిన్ ఇ డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 

Latest Videos

click me!