కొబ్బరి నూనెలో తేనె కలిపి రోజూ ముఖానికి రాస్తూ ఉండటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ముఖంపై ముడతలను శాశ్వతంగా తొలిగించవచ్చట. అయితే.. ఇది రాయడానికి కూడా ఒక పద్దతి ఉంది.
ముందుగా… ముఖాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే.. ముఖంపై చేరుకున్న దుమ్ము, దూళి మొత్తం పోవాలంటే కచ్చితంగా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖం మీద తడిపోయేంత వరకు ఆగాలి. ఆ తర్వాత.. ఒక స్పూన్ కొబ్బరి నూనెలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. బాగా స్క్రబ్ చేయాలి. మంచిగా సర్కిల్ ఫామ్ లో రుద్దాలి. ఇప్పుడు దానిని ఆరనివ్వాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు.. అది ఎండిపోయే వరకు ఆగాలి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.